Vaishnav Tej: 100 కోట్ల హిట్టు కొట్టినా.. ‘ఉప్పెన’ హీరో ఏం చేస్తున్నాడు?.. ఇంత గ్యాప్ ఎందుకు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Why Vaishnav Tej Take a 3-Year Gap: మెగా ఫ్యామిలీ నుంచి హీరోగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన వైష్ణవ్ తేజ్.. తొలి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకున్నాడు. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఉప్పెన’ సినిమాతో వైష్ణవ్ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్గా నటించగా.. ఈ జోడీకి మంచి క్రేజ్ వచ్చింది. బేబమ్మగా కృతి, ఆసీగా వైష్ణవ్ జంట ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఉప్పెన బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో పాటు రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. దీంతో తొలి సినిమాతోనే వైష్ణవ్ టాలీవుడ్లో హిట్ హీరోగా ముద్ర వేసుకున్నాడు.
అయితే ఆ తర్వాత మాత్రం ఉప్పెన స్థాయి విజయాన్ని వైష్ణవ్ తేజ్ అందుకోలేకపోయాడు. విభిన్న కథలు, జానర్లను ఎంచుకుంటూ ముందుకు వెళ్లాడు. ‘కొండపొలం’, ‘రంగ రంగ వైభవంగా’, ‘ఆదికేశవ’ వంటి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ.. ఆశించిన స్థాయిలో విజయాలను అందుకోలేకపోయాడు. దీంతో వైష్ణవ్ కెరీర్ విషయంలో కొంత గ్యాప్ ఏర్పడింది. వైష్ణవ్ దాదాపు మూడేళ్లుగా సినిమా చేయలేదు. అయితే అవకాశాలు లేకపోవడం వల్లే ఈ గ్యాప్ రాలేదట. తనకు సరిగ్గా సరిపోయే కథ, పాత్ర కోసం ఎదురుచూస్తున్నట్లు సమాచారం.
Also Read
- Sardar 2 : కార్తీపై గుర్రుగా ఉన్న తమిళనాడు థియేటర్స్ యాజమాన్యం
- BKU : ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతున్న ఇండస్ట్రీ హిట్ సినిమా 'బెత్లహేమ్ కుటుంబ యూనిట్’
- Sundeep Kishan: ‘సిగ్మా’పై కుట్రల వెనకుండి నడిపిస్తున్నది ఎవరో తెలుసు.. దొరికిపోతే మీకే ఎక్కువ నష్టం
- Mohan Babu: ఆ కష్టాలు నువ్వు పడలేవు నాని.. ఇండస్ట్రీ స్ట్రగుల్‌పై మోహన్ బాబు షాకింగ్ కామెంట్స్!
ఇప్పటికే వైష్ణవ్ తేజ్ పలువురు దర్శకులు చెప్పిన కథలను విన్నప్పటికీ.. ఇప్పటివరకు ఏ ప్రాజెక్ట్‌ను అధికారికంగా ఫైనల్ చేయలేదు. ఈ మూడేళ్లలో చాలా కథలే విన్నట్లు తెలుస్తోంది. తొలి సినిమాతోనే రూ.100 కోట్ల క్లబ్‌లోకి వెళ్లిన వైష్ణవ్.. ఆ తర్వాత వరుస పరాజయాలతో వెనుకబడ్డాడు. ఈ నేపథ్యంలో తదుపరి చేయబోయే సినిమా ఆయన కెరీర్‌కు అత్యంత కీలకంగా మారనుంది. వైష్ణవ్ ఎలాంటి కథను ఎంచుకుంటాడు? ఎవరితో కలిసి పనిచేస్తాడు? అనే విషయాలపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. సరైన కథతో వైష్ణవ్ మళ్లీ బౌన్స్‌బ్యాక్ అవుతాడేమో చూడాలి.
తాజావార్తలు
-
Vaishnav Tej: 100 కోట్ల హిట్టు కొట్టినా.. ‘ఉప్పెన’ హీరో ఏం చేస్తున్నాడు?.. ఇంత గ్యాప్ ఎందుకు?
-
Sardar 2 : కార్తీపై గుర్రుగా ఉన్న తమిళనాడు థియేటర్స్ యాజమాన్యం
-
Samsung Galaxy F08, M08: సామ్ సంగ్ Galaxy F08, Galaxy M08 భారత్‌లో లాంచ్.. 50MP కెమెరా, 6000mAh బ్యాటరీ
-
US Iran Tensions: ఇరాన్‌పై మరోసారి దాడికి ట్రంప్ బిగ్ ప్లాన్.. మిడిల్ ఈస్ట్‌కు 9,000 మంది సైనికుల తరలింపు
-
Flydubai Attack: ఫ్లైదుబాయ్ ఫ్లైట్ దాడి వెనుక ఇరాన్ హస్తం..? ట్రంప్ సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?