బికినీలో హద్దులు దాటేస్తున్న గోవా బ్యూటీ

గోవా మగువ ఇలియానా చాలాకాలం తరువాత ఓ హాట్ పిక్ తో సర్ప్రైజ్ ఇచ్చింది. కొంతకాలం క్రితం సినిమా ఇండస్ట్రీపై షాకింగ్ కామెంట్స్ చేసిన ఈ బ్యూటీ ఆ తరువాత సోషల్ మీడియాలో కన్పించలేదు. కానీ కొంత గ్యాప్ తీసుకుని ఇప్పుడు ఎల్లో బికినీలో కన్పించి సెగలు రేపుతోంది. నో మేకప్ లుక్ లో ఉన్న ఇలియానా అందానికి ఫిదా అయిపోతున్నారు ఆమె అభిమానులు. బీచ్ వద్ద తీసుకున్న ఈ పిక్ లో గ్లామర్ క్వీన్ అదిరిపోయింది. “ట్యాన్” అనే శీర్షికతో ఈ పిక్ ను షేర్ చేసింది ఇల్లీ బేబీ. ఇక ఇలా అందాలు ఆరబోయడం ఇలియానాకు కొత్త విషయమేమీ కాదు. గతంలో చాలాసార్లు బికినీలో హాట్ గా కన్పించి రచ్చ చేసింది. ఇప్పుడు తన అల్ట్రా గ్లామరస్ పిక్ తో మరోసారి అందరి దృష్టిని ఆకర్షించింది.

Read Also : ‘నారప్ప’ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్

కాగా తెలుగులో వరుసగా స్టార్ హీరోలతో జోడి కడుతూ స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న ఇలియానా బాలీవుడ్ పై మనసు పారేసుకున్న విషయం తెలిసిందే. ఆ తరువాత అక్కడి వెళ్లి పలు చిత్రాల్లో నటించినప్పటికీ గతంలో టాలీవుడ్ లో ఆమెకు వచ్చినంత క్రేజ్ అయితే రాలేదు. అయినా కూడా అక్కడే సినిమాలు చేసుకుంటూ ఉండిపోయింది. ఆ తరువాత లవ్, బ్రేకప్ అంటూ బీటౌన్ కు కూడా దూరంగా ఉంది. మళ్ళీ రవితేజతో “అమర్ అక్బర్ ఆంటోనీ” అంటూ టాలీవుడ్ కు రీఎంట్రీ ఇచ్చింది. కానీ ఆ చిత్రం డిజాస్టర్ గా నిలవడంతో టాలీవుడ్ లో అవకాశాలు రాలేదు. బాలీవుడ్ లో కూడా పెద్దగా ఆఫర్లు పలకరించలేదు. ఇలియానా ఇటీవలే “ది బిగ్ బుల్” చిత్రంలో కనిపించింది. ఇది డిస్నీ + హాట్‌స్టార్‌లో డైరెక్ట్ గా విడుదలైంది. ప్రస్తుతం ఆమె “అన్ ఫెయిర్ అండ్ లవ్లీ” అనే హిందీ సినిమాలో నటిస్తోంది.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-