Bengal BJP: తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) కన్నా ఒక్క సీటు ఎక్కువ వచ్చినా 2026 లోపే మమతా బెనర్జీ సర్కార్ పడిపోతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సుకాంత మజుందార్ అన్నారు. పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) బెంగాల్ బీజేపీకి సైద్ధాంతిక అంశమని అన్నారు. రాష్ట్రంలో ఎంపీ స్థానాలను స్వీప్ చేయడానికి ఈ చట్టం సహాయపడుతుందని అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో అవినీతి, అరాచక టీఎంసీని ఓడించాలని రాష్ట్ర ప్రజలు నిర్ణయించుకున్నారని పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మజుందార్ అన్నారు.