IC814 hijack: హైజాక్ విమానంలో అత్యంత కీలకమైన వ్యక్తి.. గుర్తించని ఉగ్రవాదులు.. అతను ఎవరంటే..?
- 1999లో హైజాకైన విమానంలో అత్యంత కీలకమైన వ్యక్తి..
- చివరి వరకు అతడిని గుర్తించలేకపోయిన ఉగ్రవాదులు..
- ప్రపంచంలో కరెన్సీ ప్రింటింగ్ ఇతడి చేతుల్లోనే..
- ‘డి లా రూ’ ఓనర్ రాబర్ట్ గియోరీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IC814 hijack: 1999లో ఖాట్మాండు నుంచి ఢిల్లీకి వస్తున్న ఇండియన్ ఎయిర్‌లైన్ విమానాన్ని ఐదుగురు ఉగ్రవాదులు హైజాక్ చేసి తాలిబాన్ పాలనలో ఉన్న ఆఫ్ఘనిస్తాన్లోని కాందహర్ తరలించారు. వారం రోజుల పాటు ప్రయాణికుల్ని బందీలుగా చేసుకుని, భారత ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ముగ్గురు ఉగ్రవాదుల్ని విడిపించుచున్నారు. ముగ్గురు ఉగ్రవాదుల్లో జైషే మహ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజార్ కూడా ఉన్నాడు. ఇతడే ఆ తర్వాత 2001 పార్లమెంట్ దాడి, ఉరీ, పుల్వామా, ముంబై ఉగ్రదాడులకు కారణమయ్యాడు.
ఇదిలా ఉంటే, ఈ ఇతివృత్తం నేపథ్యంగా ‘‘IC814 ది కాందహార్ హైజాక్’’ని నెట్‌ఫ్లిక్స్ రిలీజ్ చేసింది. దీనిపై ఎన్నో విమర్శలు కూడా వచ్చాయి. ఉద్దేశపూర్వకంగా ఉగ్రవాద హైజాకర్ల పేర్లను భోలా, శంకర్ అని హిందువులను కించపరిచేందుకు ప్రయత్నించారని సిరీస్ మేకర్స్, నెట్‌ఫ్లిక్స్‌పై ఓ వర్గం తీవ్ర విమర్శలు చేసింది. చివరకు నెట్ఫ్లిక్ దిగొచ్చి మరోసారి ఇలాంటి తప్పులు జరగనీవ్వమని కేంద్రానికి హామీ ఇచ్చింది.
Also Read
- CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
- IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
- PL-15E: జపాన్ తర్వాత ఫ్రాన్స్.. భారత్‌కు చిక్కిన చైనా PL-15E మిస్సైల్ రహస్యాలపై ఆసక్తి!
- CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
Read Also: Haryana Polls: బీజేపీ రెండో జాబితా విడుదల.. 21 మంది అభ్యర్థుల ప్రకటన
ప్రస్తుతం జనరేషన్‌కి 1999 హైజాక్‌ని మరోసారి ఈ సిరీస్ పరిచయం చేసింది. ఖట్మాండు నుంచి 176 మంది ప్రయాణికులతో బయలుదేరిన విమానంలో ఒక సంపన్న వ్యాపారవేత్త ఉండటం గురించి, హైజాకర్లు కనిపెట్టలేకపోయారు. ప్రయాణికులకు కూడా అతడి గురించిన వివరాలు తెలియవు. ఈ ప్రయాణికుడే రాబర్టో గియోరి, స్విస్-ఇటాలియన్ వ్యాపారవేత్త. ఆ సమయంలో స్విట్జర్లాండ్‌లోని అత్యంత ధనవంతులైన వ్యాపారవేత్తల్లో గియోరీ ఒకరు. ఇతను ప్రపంచంలోని కరెన్సీ – ప్రింటింగ్ వ్యాపారంలో 90 శాతానికి పైగా నియంత్రణ కలిగి ఉన్నాడు. యూకేకి చెందిన ‘డి లా రూ’ సంస్థ యజమాని. డి లా రూ ప్రపంచంలోనే 70 కంటే ఎక్కువ దేశాల కరెన్సీ ముద్రించే సంస్థ.
రాబోర్టో గియోరీ తన భాగస్వామి క్రిస్టినా కాలాబ్రేసితో కలిసి హాలిడేస్ ఎంజాయ్ చేసేందుకు ఖాట్మాండు వెళ్లారు. హైజాక్ చేయబడిన విమానంలో గియోరీ ఉండటం కూడా చర్చల సమయంలో భారత్‌పై అంతర్జాతీయ ఒత్తిడిని సృష్టించడంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషించినట్లు కొన్ని నివేదికలు పేర్కొన్నాయి. ఈ హైజాక్ ఘటనలో ఒకే ఒక్క భారతీయ ప్రయాణికులు హత్యకు గురయ్యాడు. ప్రయాణికుల్ని విడిపించేందుకు భారత్ మసూద్ అజార్, అహ్మద్ ఒమర్ సయీద్ షేక్, ముస్తాక్ అహ్మద్ జర్గార్ అనే ముగ్గురు ఉగ్రవాదుల్ని విడుదల చేసింది.
తాజావార్తలు
-
CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
-
Producers Council : మళ్లీ రానున్న ‘నంది’ జాతర…. సీఎంకు థాంక్స్ చెప్పిన నిర్మాతల మండలి
-
Chandigarh ODI : తొలుత తడబడి.. ఆపై నిలబడి.. కరీబియన్ బౌలర్లపై టీమిండియా దండయాత్ర
-
Sajjala Ramakrishna Reddy : లోకల్ ఎలక్షన్స్‌కు వైసీపీ లీగల్ టీమ్ రెడీ.. సజ్జల కీలక ఆదేశాలు
-
Baa Baa Black Sheep: సినిమా చూస్తే మేఘాలయ ట్రిప్ ఫ్రీ
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!