Lenin : ఓటీటీలోకి అఖిల్ ‘లెనిన్’.. ఎప్పుడు ఎక్కడ చూడాలంటే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అఖిల్ అక్కినేని హీరోగా తెరకెక్కిన సంచలన చిత్రం ‘లెనిన్’. అక్కినేని నాగార్జున సమర్పణలో మనం ఎంటర్ప్రైజెస్ ఎల్ఎల్పి, సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై మురళి కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. థియేటర్లలో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న ఈ చిత్రం, తాజాగా వంద కోట్ల వసూళ్ల మైలురాయిని దాటి టాలీవుడ్లో కొత్త రికార్డులు సృష్టించింది. ఇప్పుడు సిల్వర్ స్క్రీన్‌పై ఊచకోత కోసిన ఈ బ్లాక్‌బస్టర్ మూవీ, నేరుగా డిజిటల్ ప్లాట్‌ఫామ్ ద్వారా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ జీ5లో ఈ సినిమా ఆగస్ట్ 7 నుంచి అధికారికంగా స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు మేకర్స్ అధికారిక ప్రకటన విడుదల చేశారు. 90ల కాలం నాటి నేపథ్యంలో చిత్తూరు జిల్లాలోని రామచంద్రాపురం గ్రామం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ప్రతి ఏటా అక్కడ 18 రోజుల పాటు జరిగే ద్రౌపదమ్మ జాతర సమయంలో ఎలాంటి రక్తపు చుక్క చిందకూడదనే కఠినమైన ఆచారం ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో ఆ గ్రామానికి అనాథ అయిన లెనిన్ (అఖిల్) అడుగుపెడతాడు. ఈశ్వరీరావు, ఆమె తనయుడు ప్రమోద్ పంజు అతన్ని ఆదరిస్తారు. క్రమంగా అఖిల్, ప్రమోద్ మంచి స్నేహితులుగా మారుతారు. ఇదే సమయంలో అఖిల్, భాగ్యశ్రీ బోర్సె మధ్య ప్రేమ చిగురిస్తుంది.
అయితే ఊహించని పరిణామాల మధ్య కథ అనేక సంచలన మలుపులు తిరుగుతుంది. ఈ క్రమంలో అఖిల్ జైలు పాలు కావాల్సి వస్తుంది. అసలు లెనిన్ ఎందుకు జైలుకు వెళ్ళాల్సి వచ్చింది? జైలు నుంచి వచ్చాక అతను ఎవరిపై పగ తీర్చుకోవాలనుకున్నాడు? ఈ ప్రయాణంలో అతనికి ఎదురైన సవాళ్లు ఏంటి? లాంటి అనేక ఉత్కంఠభరితమైన విషయాలు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ఈ సినిమాలో అఖిల్ ఇప్పటివరకు చేయని విధంగా రా అండ్ రస్టిక్ పాత్రలో నటించి అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. ఆయన యాక్టింగ్‌కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇక భాగ్యశ్రీ బోర్సె తన గ్లామర్‌తో పాటు చక్కటి అభినయంతో ఆకట్టుకున్నారు. దర్శకుడు మురళి కిషోర్ అబ్బూరు రాసుకున్న కథ, కథనం, టేకింగ్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి. తమన్ అందించిన మాస్ మ్యూజిక్ మరియు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్రాణంగా నిలిచింది. లియోన్ బ్రిట్టో సినిమాటోగ్రఫీ, నవీన్ నూలి ఎడిటింగ్ వర్క్ ఈ విజువల్ వండర్‌ను మరింత పరిపుష్టం చేశాయి.
Also Read
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!