Secret Reveal: 46 టన్నుల ఆర్బీఐ బంగారం గుట్టుచప్పుడు కాకుండా విదేశాలకు ఎలా వెళ్లింది..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
1991లో భారతదేశం ఎదుర్కొన్న తీవ్ర ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కడంలో బంగారం అత్యంత కీలక పాత్ర పోషించింది. 1980ల కాలంలో విదేశీ అప్పులు పెరగడం, రాజకోశ లోటు అధికమవ్వడం వల్ల దేశ ఆర్థిక పరిస్థితి క్షీణించింది. దానికి తోడు 1990లో గల్ఫ్ యుద్ధం కారణంగా చమురు ధరలు మండిపోవడం, స్వదేశంలో రాజకీయ అస్థిరత నెలకొనడం వల్ల విదేశీ మారక నిల్వలు ప్రమాదకర స్థాయికి పడిపోయాయి. 1991 జూన్ నాటికి కేవలం కొద్ది వారాల దిగుమతులకు మాత్రమే సరిపడా విదేశీ కరెన్సీ భారత్ వద్ద మిగిలి ఉంది. ఈ క్లిష్ట సమయంలో దేశాన్ని దివాలా తీయకుండా కాపాడేందుకు ప్రభుత్వం తన వద్ద ఉన్న బంగారాన్ని వాడుకోవాలని నిర్ణయించింది.
మే 1991లో చంద్రశేఖర్ ప్రభుత్వ హయాంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా 20 టన్నుల బంగారాన్ని యూనియన్ బ్యాంక్ ఆఫ్ స్విట్జర్లాండ్‌కు బదిలీ చేసి, తిరిగి కొనుగోలు చేసే ఒప్పందంతో దాదాపు 200 నుంచి 215 మిలియన్ డాలర్ల నిధులను సమకూర్చుకున్నారు. అయితే ఈ నిధులు చాలకపోవడంతో, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చాలా రహస్యంగా మరో 46.91 టన్నుల బంగారాన్ని బ్యాంక్ ఆఫ్ జపాన్, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్‌లలో తాకట్టు పెట్టింది. ఈ ప్రక్రియ ద్వారా భారత్‌కు అదనంగా 405 మిలియన్ డాలర్ల విదేశీ కరెన్సీ లభించింది.
Also Read
ఈ అత్యవసర నిధులు భారత్‌కు తాత్కాలిక ఉపశమనాన్ని అందించగా, ఆ తర్వాత నాటి ఆర్థిక మంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ చారిత్రాత్మక ఆర్థిక సంస్కరణలను ప్రవేశపెట్టారు. భారత ఆర్థిక వ్యవస్థను ప్రపంచ మార్కెట్లకు తెరవడంతో పాటు ఎల్పిజి (లిబర్లైజేషర్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్) విధానాలను అమలు చేయడం ద్వారా దేశాన్ని సంక్షోభం నుంచి బయటపడేసి, అభివృద్ధి పథంలోకి నడిపించారు.
తాజావార్తలు
-
Earthquake: ఉత్తరాఖండ్‌లో భూప్రకంపనలు.. ప్రజలు పరుగులు
-
CJP Protest: CJP వెనక్కి తగ్గేది లేదు.. ఆదివారం జంతర్ మంతర్‌కు పాదయాత్ర
-
Liquor Shops: ఏపీలో మద్యం దుకాణాలకు రెండో విడత నోటిఫికేషన్.. అక్టోబర్ 19 దరఖాస్తులకు చివరి తేదీ..
-
Saudi: రియాద్ ఎయిర్‌పోర్టులో మరోసారి భారీ పేలుడు.. విమానాలు దారి మళ్లింపు
-
Mallu Bhatti Vikramarka: హైదరాబాద్‌లో ప్రపంచస్థాయి స్టేడియం.. తెలంగాణను క్రీడా హబ్‌గా మారుస్తాం..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!