Anantnag encounter: “నేను బతకకపోవచ్చు, నా బిడ్డను జాగ్రత్తగా చూసుకో”.. చివరిసారిగా భార్యకు వీడియో కాల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anantnag encounter: జమ్మూకాశ్మీర్ అనంత్‌నాగ్ జిల్లా కోకెర్‌నాగ్ ప్రాంతంలో బుధవారం తెల్లవారుజాము నుంచి భద్రతాబలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎన్‌కౌంటర్ జరుగుతోంది. దాదాపుగా 5 రోజులు గడుస్తున్నా.. ఎన్‌కౌంటర్ కొనసాగుతూనే ఉంది. ఇదిలా ఉంటే ఈ ఎదురుకాల్పుల్లో ముగ్గురు ఉన్నతాధికారులతో పాటు ఒక జవాన్ మరణించారు. కల్నల్ మన్‌ప్రీత్ సింగ్, మేజర్ ఆశిష్ , జమ్మూ కాశ్మీర్ డీఎస్పీ హుమాయున్ భట్ మరణించారు. ముగ్గురు ఉన్నతాధికారులు చనిపోవడంతో ఇటు ఆర్మీ, అటు పోలీసులతో పాటు యావత్ దేశ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తోంది.
ఇదిలా ఉంటే తీవ్రంగా గాయపడిన హుమాయున్ భట్ చివరి మాటలు అందరి గుండెల్ని పిండేస్తున్నాయి. అందరితో కన్నీరు పెట్టిస్తున్నాయి. తాను చనిపోవడానికి కొన్ని నిమిషాల ముందు భార్య ఫాతిమాతో వీడియో కాల్ లో మాట్లాడారు.‘‘ తాను ఇక బతకకపోవచ్చని, తన బిడ్డను జాగ్రత్తగా చూసుకోవాలని’’ తన కుటుంబానికి వీడియో కాల్ లో చెప్పారు.
Also Read
- Thackeray Brothers: ఠాక్రే బ్రదర్స్ 'విరాట్ గర్జన'.. ఎన్నికల సంఘంపై విపక్షాల ఉమ్మడి పోరాటం!
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
Read Also: Maharashtra: వాస్తుదోషాల పేరుతో మహిళపై పదేపదే అత్యాచారం..
హుమాయున్ భట్ తన మ్యారేజ్ అనివర్సరీకి రెండు వారాల ముందు వీరమరణం పొందారు. తనకు కొడుకు జన్మించి కేవలం కొన్ని రోజుల మాత్రమే అయ్యాయి. ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన హుమాయున్ భట్..నేను ఇక బతకను, నా గాయాలకు లొంగిపోతే, మా కొడుకును జాగ్రత్తగా చూసకోండి అంటూ తన భార్య ఫాతిమాతో మాట్లాడటం అందర్ని ఆవేదనకు గురిచేస్తున్నాయి.
తాను ఎన్‌కౌంటర్ ప్రాంతం నుంచి భట్ తండ్రితో మాట్లాడానని, మా రెస్క్యూ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నాయని, అతడిని కొండపై నుంచి కిందికి దించుతున్నామని, మేం ఏం చేస్తున్నామో అన్నింటిని భట్ తండ్రికి చూపించామని జమ్మూ కాశ్మీర్ డీజీపీ దిల్‌బాగ్ సింగ్ తెలిపారు. విపరీతమైన రక్తస్రావంతో డీఎస్పీ హుమాయున్ భట్ మరణించారు.
భట్ తండ్రి కూడా గతంలో జమ్మూకాశ్మీర్ పోలీసు డిపార్ట్మెంట్ లో పనిచేశారు. లష్కరేతోయిబాకు అనుబంధంగా పనిచేస్తున్న ‘ది రెసిస్టెన్స్ ఫోర్స్’ ఉగ్రవాదులు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఉగ్రవాదులను ఎలాగైనా తుదముట్టించాలని భద్రతబలగాలు కోకెర్ నాగ్ అటవీ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. ఆపరేషన్ కొనసాగుతోంది.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!