Hydrogen train: భారత తొలి హైడ్రోజన్ రైలు ఎలా పనిచేస్తుంది..? దీని వెనక ఉన్న సైన్స్ ఇదే..
- భారత్ తొలి స్వదేశీ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ రైలుకు శ్రీకారం.
- హైడ్రోజన్-ఆక్సిజన్ రసాయనిక చర్యతో విద్యుత్ ఉత్పత్తి.
- పొగ, కార్బన్ ఉద్గారాలు లేకుండా నీటి ఆవిరి మాత్రమే విడుదల.
- LFP బ్యాటరీ, రీజనరేటివ్ బ్రేకింగ్‌తో అధిక సామర్థ్యం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hydrogen train: భారతదేశంలో తొలి హైడ్రోజన్ రైలును శుక్రవారం ప్రధాని నరేంద్రమోడీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ రైలు హర్యానాలోని జింద్-సోనిపట్ మధ్య నడుస్తుంది. దీంతో హైడ్రోజన్ టెక్నాలజీ కలిగిన అతికొద్ది దేశాల సరసన భారత్ చేరింది. అమెరికా, జర్మనీ, జపాన్, చైనాల వద్ద మాత్రమే హైడ్రోజన్ రైల్ టెక్నాలజీ ఉంది. 10 కోచ్‌లు కలిగిన ఈ రైలు 89 కి.మీ మార్గంలో నడుస్తుంది. ప్రపంచంలోనే అతి పొడవైన, శక్తివంతమైన రైలు ఇదే అని నిపుణులు చెబుతున్నారు.
ఎలా పనిచేస్తుంది.?
ఈ రైలులో హైడ్రోజన్ సిలిండర్లు నిల్వ చేసిన రెండు బోగీలు ఉంటాయి. హైడ్రోజన్ గ్యాస్‌ను హై ప్రెజర్ ట్యాంకుల్లో నిల్వ చేశారు. ఈ మొత్తం రైలులో అత్యంత కీలమైంది 1200 కిలోవాట్ల ప్రోటాన్ ఎక్స్చేంజ్ మెంబ్రేన్ ఫ్యూయల్ సెల్(PEMFC). దీంట్లోనే హైడ్రోజన్, ఆక్సిజన్ మధ్య రసాయనిక చర్య జరిగి విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఈ మొత్తం చర్యలో బై ప్రొడక్ట్స్‌గా నీటి ఆవిరి, వేడి మాత్రమే విడుదలవుతుంది. పూర్తిగా ఎలాంటి కర్బన ఉద్గారాలు లేని క్లీన్ ఎనర్జీగా చెప్పవచ్చు.
Also Read
- Mamata Banerjee: అభ్యర్థి ఔట్.. కాంగ్రెస్‌కు మమత మద్దతు: బెంగాల్ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్..
- PM Modi: నిరుద్యోగులకు శుభవార్త.. రేపు 51 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందించనున్న మోడీ
- Mamata Banerjee: మమతా బెనర్జీకి బిగ్ షాక్.. నందిగ్రామ్ పోటీ నుంచి అభ్యర్థి విత్‌డ్రా..
- Suvendu Adhikari: మమతకు ‘‘శ్రీరాముడి శాపం’’.. బెంగాల్ సీఎం ఫైర్..
ముందుగా హైడ్రోజన్ గ్యాస్ PEMFC సెల్‌లోకి చేరుతుంది. ఫ్లాటినం ఆధారిత క్యాటలిస్ట్ సాయంతో హైడ్రోజన్ అణువులు ప్రోటాన్లు, ఎలక్ట్రాన్లుగా విడిపోతాయి. ఎలక్ట్రాన్లు విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తాయి. ఇదే సమయంలో బయట వాతావరణంలో ఉండే ఆక్సిజన్ ఫ్యూయల్ సెల్‌లోకి ఎంటర్ అవుతుంది. హైడ్రోజన్ ప్రోటాన్లు, ఎలక్ట్రాన్లతో కలిసి నీటి ఆవిరి, హీట్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇలా తయారైన విద్యుత్ లిథియం ఐరన్ ఫాస్పేట్(ఎల్ఎఫ్పీ) బ్యాటరీల్లో నిక్షిప్తం అవుతుంది. ఇది ఇంజన్‌కు అదనపు శక్తిని, యాక్సిలిరేషన్ను ఇస్తుంది. రైలు బ్రేకులు వేసిన సమయంలో ‘‘రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్’’ వల్ల ఉత్పత్తి అయ్యే విద్యుత్ మళ్లీ బ్యాటరీల్లో నిల్వ అవుతుంది.
హైడ్రోజన్ నిల్వ, రీఫ్యూయలింగ్ కేంద్రం ఏర్పాటు:
హర్యానాలోని జింద్‌లో దేశంలో అతిపెద్ద హైడ్రోజన్ నిల్వ, రీఫ్యూయలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. సుమారు 3000 కిలోల హైడ్రోజన్ నిల్వ సామర్థ్యం కలిగి ఉంది. NFPA-2, ISO 19880 అంతర్జాతీయ భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా దీనిని నిర్మించారు.
రైలు ప్రత్యేకతలు ఇవే:
ఈ రైలు 10 బోగీలను కలిగి ఉంటుంది. ఇందులో 2 హైడ్రోజన్ పవర్ కార్లు, 8 కోచ్‌లు ఉంటాయి. సుమారు 2600 మంది ప్రయాణికుల సామర్థ్యాన్ని కలిగి ఉంది. గరిష్ట ఆపరేటింగ్ వేగం గంటకు 75 కిలోమీటర్లు. నిజమైన వేగం గంటకు 110 కి.మీ ఉంటుంది. ఈ రైలు పూర్తిగా స్వదేశీ సాంకేతికతతో RDSO అభివృద్ధి చేసింది.
తాజావార్తలు
-
Warren Buffett: తండ్రి స్థానంలో కొడుకు.. వారెన్ బఫెట్ సామ్రాజ్యానికి కొత్త రారాజు ఇతడే!
-
Danam Nagender : దానం నాగేందర్ ఉదంతంపై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు..
-
NSE IPO: రెండో రోజే NSE ఐపీఓ 100 శాతం సబ్‌స్క్రైబ్.. ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..
-
Mamata Banerjee: అభ్యర్థి ఔట్.. కాంగ్రెస్‌కు మమత మద్దతు: బెంగాల్ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్..
-
PM Modi: నిరుద్యోగులకు శుభవార్త.. రేపు 51 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందించనున్న మోడీ
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..