Today Business Headlines 28-03-23: 4 ఏళ్లలో 2134 కోట్లు: తెలంగాణ రాష్ట్రంలోని వివిధ కంపెనీలు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ.. సీఎస్‌ఆర్.. కింద 2 వేల 134 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేశాయి. ఈ నిధులతో వివిధ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాయి. 2016-17వ సంవత్సరం నుంచి 2020-21వ సంవత్సరం వరకు అందుబాటులో ఉన్న ఈ సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వం నిన్న సోమవారం లోక్‌సభలో వెల్లడించింది.
Tata Motors and Uber: ఉబర్ సంస్థ అతిత్వరలో హైదరాబాద్‌లో విద్యుత్ కార్లను ప్రవేశపెట్టనుంది. తద్వారా భాగ్య నగరంలో కాలుష్య నియంత్రణకు తనవంతు కృషి చేయనుంది. ఈ ఎలక్ట్రిక్ వెహికిల్స్ సరఫరా కోసం ఉబర్ కంపెనీ.. టాటా మోటార్స్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా టాటా మోటార్స్ 25 వేల ఎక్స్‌ప్రెస్-టీ మోడల్ వాహనాలను ఉబర్ సంస్థకు అందిస్తుంది. మన దేశంలోని గ్రీన్ మొబిలిటీ సెక్టార్‌లో ఇంత పెద్ద ఒప్పందం కుదరటం ఇదే తొలిసారి. ఉబర్ కంపెనీ…