CM Revanth Reddy: హైదరాబాద్‌కి నెట్‌ఫ్లిక్స్, వార్నర్ బ్రదర్స్ ఎంట్రీ.. సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy: తెలంగాణ రాజధాని హైదరాబాద్ గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్స్‌కు తిరుగులేని అడ్డాగా మారుతోంది. ప్రపంచవ్యాప్తంగా పేరెన్నికగన్న బహుళజాతి సంస్థలు భాగ్యనగరంలో తమ కార్యకలాపాలను విస్తరించేందుకు పోటీ పడుతున్నాయి. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించుకున్న భారీ లక్ష్యాన్ని నిర్దేశిత గడువు కంటే ముందే ఛేదించి సరికొత్త రికార్డు సృష్టించినట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారికంగా ప్రకటించారు. ఈ ఏడాది హైదరాబాద్‌లో 100 సరికొత్త గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ల (GCC) ఏర్పాటును టార్గెట్‌గా పెట్టుకోగా, ఆ మైలురాయిని గడువు కంటే ముందే పూర్తి చేయడం ఇప్పుడు జాతీయ స్థాయిలో హాట్ టాపిక్‌గా మారింది. రాష్ట్రంలో అమలవుతున్న పారదర్శక పాలన, శరవేగంగా తీసుకుంటున్న నిర్ణయాలే ఈ స్థాయి అంతర్జాతీయ పెట్టుబడుల వెల్లువకు కారణమని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. వినోదం, ఫార్మా, ఎఫ్ఎంసీజీ రంగాల అగ్రగామి సంస్థలైన నెట్‌ఫ్లిక్స్, వార్నర్ బ్రదర్స్, ఆమ్జెన్, యూనిలీవర్ వంటి ప్రముఖ అంతర్జాతీయ బ్రాండ్లు భాగ్యనగరాన్ని తమ కీలక కేంద్రంగా ఎంచుకున్నాయని వెల్లడించారు. అంతర్జాతీయ దిగ్గజ సంస్థల ఎంట్రీతో భాగ్యనగరం ప్రపంచ స్థాయి వాణిజ్య, సాంకేతిక హబ్‌గా అవతరించిందని పేర్కొన్నారు.
తెలంగాణను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ ద్వారా అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన పారిశ్రామిక వ్యవస్థకు రూపకల్పన చేస్తున్నట్లు సీఎం తెలిపారు. ప్రపంచ స్థాయి మౌలిక వసతులు, ఆధునిక సాంకేతిక వనరులతో నిర్మిస్తున్న ఈ సిటీ గ్లోబల్ ఇన్వెస్టర్లకు ప్రధాన ఆకర్షణగా నిలవనుందని వివరించారు. విదేశీ పెట్టుబడులు, తెలంగాణలోని స్థానిక నైపుణ్యాల అద్భుత కలయికతో దేశ ఆర్థిక ప్రగతిని రాష్ట్రం ముందుండి నడిపిస్తోందని సీఎం రేవంత్ రెడ్డి గర్వంగా ప్రకటించారు. పెట్టుబడుల ఆకర్షణలో తెలంగాణ సరికొత్త బెంచ్‌మార్క్ సృష్టిస్తోందని సీఎం చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియా, పారిశ్రామిక వర్గాల్లో ట్రెండ్ అవుతోంది.
Also Read
- Hyderabad Traffic Police : డ్రైవింగ్ చేస్తూ సెల్‌ఫోన్ వాడిన 3600 మంది పట్టుకున్న పోలీసులు..
- Trafficking: ఫెర్టిలిటీ సెంటర్లలో త్వరలోనే తనిఖీలు.. కఠిన చర్యలకు మల్కాజ్గిరి సీపీ హెచ్చరిక..
- DG Charu Sinha: మహిళల భద్రత ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత
- Gambling Raid: వట్టినాగులపల్లిలో పేకాట స్థావరంపై పోలీసుల మెరుపు దాడి
I appreciate @Bloomberg for highlighting the momentum we are building here in Hyderabad, Telangana.
Transformation on this scale is the direct result of purposeful governance and decisive execution. Over the past two years, our administration has brought in dozens of…
— Revanth Reddy (@revanth_anumula) September 21, 2026
తాజావార్తలు
-
Irumudi : ‘ఇరుముడి’ నిర్మాతలకు తెలంగాణ లేబర్ డిపార్ట్మెంట్ షాక్.. ఆ 20 శాతం డబ్బు ఏమైంది?
-
SA VS AUS: 10 ఏళ్ల కష్టానికి ఫలితం.. పాయింట్స్ టేబుల్ టాప్‌లోకి దూసుకెళ్లిన దక్షిణాఫ్రికా..
-
Srikaanth Odela: విభజన నేపథ్యంతో కొత్త లవ్ స్టోరీ.. శ్రీకాంత్ ఓదెల నయా ప్లాన్!
-
Scene Trailer: సైకో కిల్లర్‌తో మాజీ కాప్ ఆట.. సూర్య ‘సీన్’ ట్రైలర్ చూశారా?
-
Arjuna: పవన్ కళ్యాణ్‌తో దిల్ రాజు పాన్-ఇండియా మూవీ.. టైటిల్ ఇదేనట?
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!