US-Iran: ఇరాన్ ఎయిర్‌లైన్స్‌కు అమెరికా భారీ షాక్.. ఎల్లుండి నుంచి ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోనున్న సర్వీసులు!
- ఇరాన్ ఎయిర్‌లైన్స్‌పై అమెరికా కఠిన ఆంక్షలు
- విదేశీ సంస్థలు సహకరించొద్దని హెచ్చరిక
- ఎల్లుండి నుంచి ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోనున్న సర్వీసులు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇరాన్‌కు చెందిన ఎయిర్‌లైన్స్‌పై అమెరికా మరింత కఠినమైన ఆంక్షలు విధిస్తోంది. సెప్టెంబర్ 23 నుంచి ప్రపంచవ్యాప్తంగా ఇరాన్ ఎయిర్‌లైన్స్ కార్యకలాపాలు నిలిచిపోయే పరిస్థితి ఏర్పడుతుందని అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ హెచ్చరించారు. ఇరాన్ విమానాలకు విమానాశ్రయాలు, ఇంధనం, ల్యాండింగ్ సర్వీసులు, టికెట్ విక్రయాలు వంటి సేవలు అందించే విదేశీ సంస్థలు కూడా అమెరికా ఆంక్షల పరిధిలోకి వచ్చే అవకాశం ఉందని వెల్లడించారు.
కీలక ఆంక్షలు..
“సెప్టెంబర్ 23నాటికి ప్రపంచవ్యాప్తంగా అన్ని ఇరాన్ ఎయిర్‌లైన్స్ మూసివేయబడతాయి” అని స్కాట్ బెసెంట్ పేర్కొన్నారు. ఇరాన్ విమానాలు విదేశాల్లో ల్యాండ్ అయినా వాటికి ఇంధనం అందించడం, ల్యాండింగ్ సేవలు ఇవ్వడం, టికెట్లు విక్రయించడం వంటి కార్యకలాపాలకు సహకరిస్తే సంబంధిత సంస్థలు అమెరికా ఆంక్షలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఇరాన్ విమానాలకు సేవలు అందించే సంస్థలు అమెరికా డాలర్ వ్యవస్థను కోల్పోయే ప్రమాదం కూడా ఉందని బెసెంట్ స్పష్టం చేశారు. దీంతో ఇరాన్ ఎయిర్‌లైన్స్‌కు అంతర్జాతీయంగా కార్యకలాపాలు నిర్వహించడం మరింత కష్టంగా మారే అవకాశం ఉంది.
Also Read
- Israel Elections: యూదుల గడ్డపై అరబ్ పార్టీల హవా.. నెతన్యాహూకు షాక్.!
- Bangladesh: ‘‘షేక్ హసీనా వీడియో, RAW ఏజెంట్’’.. సంచలనంగా బంగ్లా మాజీ ఎయిర్‌ఫోర్స్ అధికారి మరణం!
- Ilhan Omar: సోదరుడితో పెళ్లి ఆరోపణలు.. అమెరికా ఎంపీ ఇల్హాన్ ఒమర్‌పై విచారణ!
- Israel Elections: ఇజ్రాయిల్ ఎన్నికల్లో జోక్యం.. ‘‘మమ్మల్ని బలిపశువు చేయొద్దు’’ అని ఖతార్ కౌంటర్..
27 ఇరాన్ ఎయిర్‌లైన్స్‌పై ఆంక్షలు
ఇప్పటికే అమెరికా ఇరాన్ విమానయాన రంగంపై ఆంక్షలను మరింత విస్తరించింది. సెప్టెంబర్ 8న అమెరికా ట్రెజరీ శాఖ 27 ఇరాన్ ఎయిర్‌లైన్స్‌తో పాటు ఆ దేశ విమానయాన రంగానికి అనుబంధంగా ఉన్న పలు సంస్థలు, మధ్యవర్తులపై ఆంక్షలు విధించినట్లు ప్రకటించింది. ఇరాన్‌తో వ్యాపారం చేసే విదేశీ సంస్థలపైనా అమెరికా ఒత్తిడి పెంచుతోంది. ఆంక్షలు ఎదుర్కొంటున్న ఇరాన్ సంస్థలకు సేవలు లేదా వ్యాపార సహకారం అందించే విదేశీ కంపెనీలపై కూడా అమెరికా ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన ఆంక్షలు విధించే అవకాశం ఉందని వాషింగ్టన్ హెచ్చరిస్తోంది.
విమానయాన రంగమే టార్గెట్ ఎందుకు?
ఇరాన్ విమానయాన రంగం ఇప్పటికే ఎన్నో సంవత్సరాలుగా అమెరికా ఆంక్షలను ఎదుర్కొంటోంది. దీంతో కొత్త విమానాలు, విడిభాగాలు, సాంకేతిక పరిజ్ఞానం, నిర్వహణ సేవలను పొందడంలో ఇరాన్ ఎయిర్‌లైన్స్‌కు ఇబ్బందులు ఉన్నాయి. తాజా చర్యల్లో ఇరాన్ వెలుపల ఉన్న సంస్థలు, మధ్యవర్తులపై కూడా అమెరికా దృష్టి పెట్టింది. ఇరాన్ ఎయిర్‌లైన్స్ కోసం అమెరికాలో తయారైన విమానాలు, సున్నితమైన విమానయాన సాంకేతికతను సమకూర్చేందుకు ప్రయత్నించిన విదేశీ నెట్‌వర్క్‌లను కూడా టార్గెట్ చేసినట్లు అమెరికా ట్రెజరీ తెలిపింది.
గతంలో ఆంక్షలు
ఇరాన్‌కు చెందిన ప్రముఖ విమానయాన సంస్థ మహాన్ ఎయిర్‌కు గతంలోనే అమెరికా ఆంక్షలు విధించింది. ఈ సంస్థ ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్కు మద్దతు ఇస్తోందని అమెరికా ఆరోపించింది. జూలైలోనూ మహాన్ ఎయిర్ కార్యకలాపాలకు సహకరించారనే ఆరోపణలతో పలు దేశాల్లోని సంస్థలు, వ్యక్తులపై అమెరికా ఆంక్షలు విధించింది. తాజా ఆంక్షల నేపథ్యంలో అంతర్జాతీయ విమానాశ్రయాలు, ఇంధన సరఫరాదారులు, టికెట్ విక్రయ సంస్థలు, బ్యాంకులు, ఇతర సేవల సంస్థలు ఇరాన్ ఎయిర్‌లైన్స్‌తో పనిచేయడానికి వెనుకడుగు వేసే అవకాశం ఉంది.
పెరుగుతున్న ఉద్రిక్తతలు
ఇరాన్‌పై ఆర్థిక ఒత్తిడిని మరింత పెంచే అమెరికా చర్యల్లో భాగంగానే తాజా ఆంక్షలను చూస్తున్నారు. ఇరాన్‌ను అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ నుంచి దూరం చేయడమే లక్ష్యంగా ట్రంప్ ప్రభుత్వం చర్యలు చేపడుతోందని బెసెంట్ తెలిపారు. ఆగస్టులో అమెరికా ట్రెజరీ శాఖ ‘ఆపరేషన్ ఎకనామిక్ ఔట్‌కాస్ట్’ పేరుతో ఇరాన్ ఆర్థిక, విమానయాన, షిప్పింగ్ తదితర రంగాలకు సంబంధించిన నెట్‌వర్క్‌లను లక్ష్యంగా చేసుకున్న చర్యలను ప్రారంభించింది.
ఇదిలా ఉండగా.. అమెరికా–చైనా ఆర్థిక చర్చల నేపథ్యంలోనూ బెసెంట్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. చైనా ఇరాన్‌కు కీలకమైన ఆర్థిక భాగస్వాముల్లో ఒకటిగా ఉండటంతో.. ఇరాన్‌పై అమెరికా ఆంక్షలను దేశ సరిహద్దులు దాటి అమలు చేసే ప్రయత్నాలు అంతర్జాతీయంగా ప్రభావం చూపే అవకాశం ఉంది.
- Tags
- Iran
- Scott bessent
- us
తాజావార్తలు
-
PM Modi Praises ISRO: ఇస్రో శాస్త్రవేత్తల అంకితభావం దేశానికి గర్వకారణం.. NVS-03 ప్రయోగంపై ప్రధాని మోడీ ప్రశంసలు
-
AP Rain Alert: ఏపీలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు.. ఈ జిల్లాల ప్రజలు జాగ్రత్త!!
-
Census 2027 Dates Announced: జనగణన 2027 తేదీలు ప్రకటించిన కేంద్రం.. ఈ రాష్ట్రాల్లో లేదు!.. పూర్తి షెడ్యూల్ ఇదే
-
ISRO NVS-03: భారత్‌కు మరో అంతరిక్ష విజయం.. NVS-03 ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించిన GSLV-F18.. ప్రత్యేకతలివే
-
Free MRI Scans : ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచిత ఎంఆర్ఐ.. సర్కారు కీలక నిర్ణయం.!
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!