రెస్టారెంట్, తినుబండారాల యజమానులు గుర్తింపును తప్పనిసరిగా ప్రదర్శించాలంటూ హిమాచల్‌ప్రదేశ్ మంత్రి విక్రమాదిత్య సింగ్ ఆదేశాలు జారీ చేశారు. ఆహార భద్రత, పరిశుభ్రతను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. అయితే ఈ ప్రకటనపై వ్యాపారుల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.