Tollywood : ట్రంప్ ట్యాక్స్.. ఓవర్సీస్ లో తెలుగు సినిమాకు గట్టి దెబ్బ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికాలో సినీ పరిశ్రమ నష్టాల ఊబిలోకి వెళ్తోందని, అక్కడి స్టూడియోలు యునైటెడ్ స్టేట్స్ నుంచి ఇతర దేశాలకు తరలి వెళ్తున్నాయని అందువల్ల ఇతర దేశాలలో నిర్మించి USAలో విడుదలయ్యే సినిమాలపై 100శాతం ట్యాక్స్ విధిస్తూ వెంటనే అమలు జరిగేలా వాణిజ్య శాఖ, వాణిజ్య ప్రతినిధులకు ఆదేశాలు జారీ చేసాడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. రంగంలోకి దిగిన అధికారులు అందుకు సంబందించిన చర్యలను ముమ్మరం చేసారు.
Also Read : JR. NTR : మ్యాన్ ఆఫ్ మాస్ ఎన్టీఆర్ బర్త్ డే.. ఫ్యాన్స్ కు ‘డబుల్’ ధమాకా
Also Read
- Kona Venkat: షూటింగ్‌కు ముందే నెట్‌ఫ్లిక్స్ డీల్.. ‘హైకూ’పై కోన వెంకట్ సంచలన కామెంట్స్!
- ‘గాడ్ ఆఫ్ వార్’ అఫిషియల్ టైటిల్ కాదు.. NTR - Trivikram Movie పై నాగవంశీ బిగ్ క్లారిటీ!
- Naga Vamsi: ‘జైలర్ 2 హై రేట్ పెట్టి ఎందుకు కొన్నానంటే'.. అసలు నిజం చెప్పిన నాగవంశీ!
- Director Balraj Kalarickal: 28 ఏళ్లకే దర్శకుడు బాలరాజ్ కలరికల్ కన్నుమూత.. ‘కప్పి స్క్వాడ్’ వెబ్ సిరీస్‌తో గుర్తింపు
కాగా ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు తెలుగు సినిమాపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాల తర్వాత టాలీవుడ్ కు పెద్ద మార్కెట్ అంటే అది ఓవర్సీస్ మాత్రమే. ముఖ్యంగా నార్త్ అమెరికాలో మన సినిమాలు భారీ వసూళ్లు రాబడతాయి. ఆ వసూళ్లు నిర్మాతలను భారీ నష్టాల నుండి గట్టెక్కించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. నాని నటించిన లేటెస్ట్ సినిమా హిట్ 3 నార్త్ అమెరికాలో 2 మిలియన్ డాలర్స్ రాబట్టింది. కానీ ఇక నుండి ఈ నంబర్స్ కనిపించక పోవచ్చు. కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ లోనే మిలియన్ డాలర్స్ రాబట్టే తెలుగు సినిమాలు ఇకనుండి మోస్తరు కలెక్షన్స్ రాబట్టొచ్చు. 100 శాతం టారిఫ్ అమలు చేస్తే టికెట్ రేట్లు భారీగా పెరిగే అవకాశం ఉంటుంది. తెలుగు స్టేట్స్ లో అధిక టికెట్ ధర కారణంగా సినిమాలకు ప్రేక్షకులు ఎంత దూరంగా ఉన్నారు అనేది చూస్తూనే ఉన్నాం. ఇక ఇదే పరిస్థితి అమెరికాలోను రావచ్చు. అలా కాకుండా ట్రంప్ అమలు చేసే సుంకాలకు అనుగుణంగా రైట్స్ తగ్గించి అమ్మితే నిర్మాతకు మేజర్ దెబ్బ పడుతుంది. పోనీ టాక్స్ లను ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్స్ భరిద్దాం అనుకుంటే హిట్ అయితే రిటర్న్ వసూళ్లు గట్టిగానే ఉంటాయి. కానీ ప్లాప్ అయితే భారీ నష్టాలకు తోడు ట్రంప్ టాక్స్ అదనం. ఏదేమైన సరే తెలుగు సినిమాలు ఇంతకు ముందులాగా కోట్లకి కోట్లు కలెక్షన్స్ అనేవి రాబోయే రోజుల్లో చూడకపోవచ్చు. ఈ టారిఫ్ అమలైతే టాలీవుడ్‍పై ఎఫెక్ట్ ఏ స్థాయిలో ఉంటుందనేది ఇంకా క్లారిటీ కావాల్సి ఉంది. ఎంత వసూళ్లు వస్తే ఎంత టాక్స్ అనేది ఉంటుందా లేదా మరేమైనా విధానం అనేది మరికొద్ది రోజుల్లో క్లారిటీ వస్తుంది. ట్రంప్ ట్యాక్స్ ఎదుర్కోబోతున్న ఫస్ట్ మిడ్ రేంజ్ సినిమా శ్రీ విష్ణు సింగిల్. కాస్త పెద్ద సినిమా విజయ్ దేవరకొండ నటించిన ‘కింగ్డమ్’. ఈ రెండు సినిమాలను బట్టి అమెరికాలో తెలుగు సినిమా భవితవ్యం ఏంటో తెలుస్తుంది.
తాజావార్తలు
-
Kolkata: కోల్‌కతాలో తీవ్ర విషాదం.. దుర్గా మండపంలో తొక్కిసలాట, 17 మంది మృతి?
-
UP News: వివాహేతర సంబంధాన్ని వ్యతిరేకించాడని భర్త హత్య.. భార్యతో సహా నలుగురి అరెస్ట్..
-
Kona Venkat: షూటింగ్‌కు ముందే నెట్‌ఫ్లిక్స్ డీల్.. ‘హైకూ’పై కోన వెంకట్ సంచలన కామెంట్స్!
-
Smart Projectors: ఇక టీవీలతో పనేలేదు.. చీప్ రేటుకే ఇంట్లోనే మల్టీప్లెక్స్ రేంజ్ ఫీలింగ్!
-
Ind vs WI 5th T20: టాస్ గెలిచిన వెస్టిండీస్.. సిరీస్ కోసం ఇరు జట్ల పోరు
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!