పూర్తిగా ఫిట్‌గా ఉండాలంటే రోజూ ఎన్ని గంటల నిద్ర అవసరం అని మిమ్మల్ని అడిగితే, బహుశా ఒకరి సమాధానం 8 గంటలు, మరొకరు 6 గంటలు అని సమాధానమిస్తారు. అయితే జపాన్‌కు చెందిన ఓ వ్యక్తి గత 12 ఏళ్లుగా ప్రతిరోజూ కేవలం 30 నిమిషాలు మాత్రమే నిద్రిస్తున్నాడట. ఆయన ఆరోగ్య రహస్యం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. డైసుకే హోరీ అనే 40 సంవత్సరాల వ్యక్తి, వృత్తిరీత్యా వ్యాపారవేత్త. అదే కాదు ఆయన పూర్తిగా ఫిట్‌గా ఉన్నాడు. అతను రోజుకు 30 నిమిషాలు మాత్రమే నిద్రపోతాడు.
READ MORE: Hair Care Tips: జుట్టుకు ఎక్కువగా నూనె రాస్తున్నారా.. హానికరం..!
అంత తక్కువగా నిద్రపోతూ.. చురుగ్గా ఎలా ఉంటున్నాడనే ప్రశ్న అందరిలో తలెత్తుతోంది.
దీనిపై అతను స్పందిస్తూ.. తక్కువ నిద్ర కోసం తన శరీరానికి, మనస్సుకు పూర్తిగా శిక్షణ ఇచ్చానని చెప్పాడు. తన దైనందిన జీవితంలో పని గంటలను పెంచుకునేందుకు ఇలా చేసినట్లు తెలిపాడు. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ప్రకారం.. హోరీకి 12 సంవత్సరాల క్రితం తక్కువగా నిద్రపోయే అలవాటు ప్రారంభమైంది. 2016లో.. అతను జపాన్ షార్ట్ స్లీపర్స్ ట్రైనింగ్ అసోసియేషన్‌ను ప్రారంభించాడు. అక్కడ అతను ప్రజలకు ఆరోగ్యం, నిద్ర సంబంధిత తరగతులను ఇస్తాడు. అంతే కాదు రోజూ గంటకు పైగా జిమ్‌కి కేటాయిస్తున్నాడు.
READ MORE: Donkey milk: గాడిద పాలుతో ఎన్ని లాభాలో..!
జపాన్‌కు చెందిన యోమియురి టీవీ హోరీ రోజువారీ జీవితంపై ఒక షో చేసింది. ఇందులో 3 రోజుల పాటు హోరీ కార్యక్రమాలను ప్రపంచానికి అందించాడు. ఈ కాలంలో హోరీ రోజూ 25 లేదా 30 నిమిషాలు మాత్రమే నిద్రపోయేవాడు. స్లీపర్స్ ట్రైనింగ్ అసోసియేషన్‌లో ఇప్పటి వరకు 2100 మంది యువతకు తక్కువ నిద్రతో జీవించే మెలకువలను హోరీ నేర్పాడు. దైనందిన జీవితంలో ఏదైనా ఆట ఆడటం అలవాటు చేసుకుంటే.. తక్కువ నిద్రపోవడం మీకు కష్టమైన పని కాదని హోరీ అంటున్నాడు. అలాగే.. ఇలాంటి జీవనశైలిని అవలంబించడంలో కాఫీ చాలా బాగా ఉపయోగపడుతుందని పేర్కొన్నాడు. అతను తినడానికి గంట ముందు కాఫీ తాగుతాడు.. తద్వారా అతను నిద్ర, అలసటను నుంచి ఉపశమనం లభిస్తుందని హోరీ చెప్పాడు.
Daisuke Hori slept only 30 minutes a day for 12 years, Daisuke Hori, Japan, Latest Telugu News