కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ డీప్ ఫేక్ వీడియోను షేర్ చేసినందుకు చిరాగ్ పటేల్ అనే వ్యక్తిపై గుజరాత్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ మేరకు గుజరాత్ మంత్రి హర్ష్ సంఘవి తెలిపారు. కేంద్రమంత్రిపై ఉద్దేశపూర్వకంగా డీప్‌ఫేక్ వీడియో చేసినట్లుగా హర్ష్ సంఘవి పేర్కొన్నారు.