Thangalaan Telugu Trailer Released: చియాన్ విక్రమ్ నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ మూవీ “తంగలాన్”ను దర్శకుడు పా రంజిత్ డైరెక్ట్ చేస్తున్నారు. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్న ఈ “తంగలాన్” సినిమాలో పార్వతీ తిరువోతు, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలో యదార్థ ఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందింది. “తంగలాన్” సినిమా త్వరలోనే వరల్డ్ వైడ్ గా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇక ఈ క్రమంలో ఈ రోజు “తంగలాన్” సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్.
Breaking: Praneeth Hanumanthu: ప్రణీత్ హనుమంతు అరెస్ట్
ఈ ట్రైలర్ చూశాక “తంగలాన్” సినిమా కోసం విక్రమ్ మారిపోయిన తీరు ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరిచింది. “తంగలాన్” ట్రైలర్ లో చావును ఎదురించే వాళ్లకు మాత్రమే ఇక్కడ జీవితం అంటూ పూర్తిగా పరకాయ ప్రవేశం చేసిన ఒక పాత్రలో విక్రమ్ చెబుతూ ఉండడం కనిపిస్తోంది. మొత్తంగా ట్రైలర్ ను చూడాలే కానీ వర్ణించలేని విధంగా ఉంది. ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్, విజువల్స్ అయితే వేరే లెవల్లో ఉన్నాయి. సంగీతం – జీవీ ప్రకాష్ కుమార్ అందిస్తున్న ఈ సినిమాకి ఆర్ట్ – ఎస్ ఎస్ మూర్తి, ఎడిటింగ్ – ఆర్కే సెల్వ, స్టంట్స్ – స్టన్నర్ సామ్ అందించారు.