Bombay High Court: “పాకిస్తాన్ లేదా గల్ఫ్ కంట్రీకి వెళ్లండి”.. శరణార్థిపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం..
- పాకిస్తాన్ లేదా గల్ఫ్ కంట్రీకి వెళ్లండి..
- భారత్‌లో ఎక్కువ కాలంగా ఉంటున్న శరణార్థిపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bombay High Court: భారత ప్రభుత్వం ‘‘దేశం వదిలి వెళ్లాలి’’ అని నోటీసులు జారీ చేసినప్పటికీ యెమెన్‌కి చెందిన వ్యక్తి ఇండియాలో ఉండటంపై బాంబే హైకోర్టు బుధవారం ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘పాకిస్తాన్ లేదా గల్ఫ్ దేశాలకు వెళ్లాలి’’ అంటూ న్యాయమూర్తి అన్నారు. భారతదేశ ఉదారవాద వైఖరిని శరణార్థులు ‘అనవసర ప్రయోజనాలకు’ ఉపయోగించుకోలేరని న్యాయమూర్తులు రేవతి మోహితే దేరే, పృథ్వీరాజ్ చవాన్లతో కూడిన డివిజన్ బెంచ్ పేర్కొంది.
యెమెన్ దేశానికి చెందిన పిటిషనర్ ఖాలీద్ గోమాయి మహ్మద్ హసన్ భారతదేశంలో ఎక్కువ కాలం ఉండటంతో, ‘భారత్ నుండి వెళ్లిపోండి’ నోటీసుల్ని అధికారులు జారీ చేశారు. అయితే, ఈ బలవంతపు బహిష్కరణ నుంచి కొంత ఉపశమనం కావాలని అతను బాంబే హైకోర్టుని ఆశ్రయించారు. తాను ఆస్ట్రేలియా వెళ్లాలని అనుకుంటున్నానని కొంత సమయం కావాలని కోరారు. ‘రెఫ్యూజీ’ కార్డు హోల్డర్ అయిన పిటిషనర్ హసన్‌కు పూణే పోలీసులు ‘లీవ్ ఇండియా నోటీసు’ అందించారు. శరణార్థుల కోసం ఐక్యరాజ్యసమితి హైకమిషన్ (UNHCR) వారికి శరణార్థి కార్డును జారీ చేసింది.
Also Read
- Bhagat Singh: నేటికీ భారత యువత నరనరాల్లో ప్రవహిస్తున్న విప్లవాగ్ని భగత్.. ఉరితాడును ముద్దాడిన వీరుడి కథ..
- Gold Ring Scheme: పుట్టిన బిడ్డకు గోల్డ్ రింగ్.. కొత్త పథకానికి సీఎం విజయ్ శ్రీకారం
- UPI Charges: యూపీఐ చెల్లింపు ఛార్జీలపై నిషేధం ఉంటుందా? నేడు సుప్రీంకోర్టులో విచారణ
- IndiGo Flight: ల్యాండింగ్‌కు ముందు రన్‌వేను తాకిన ఇండిగో విమానం.. గో-అరౌండ్తో తప్పిన ప్రమాదం
Read Also: Donald Trump: ఆమె భారతీయురాలా..? నల్లజాతీయురాలా?.. కమలా హారిస్‌ని ఉద్దేశించి ట్రంప్ వ్యాఖ్యలు..
తన దేశం యెమెన్ ప్రపంచంలోనే అత్యంత ఘోరమైన మానవతా సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని, గత 10 ఏళ్లుగా భారత్‌లో నివసిస్తు్న్నానని, అంతర్గత అంతర్యుద్ధం కారణంగా 4.5 మిలియన్ల ప్రజలు నిరాశ్రయయ్యారని హసన్ తన పిటిషన్లో పేర్కొన్నారు. తన బహిరంగ బహిష్కరణ భార్య, పిల్లల ప్రాణాల్ని రిస్కులో పడేస్తుందని చెప్పారు. ప్రతిపాదిత బహిష్కరణ అంతర్జాతీయ ఆచార చట్టాలకు మరియు భారత రాజ్యాంగానికి విరుద్ధం అంటూ కోర్టులో వాదించారు.
హసన్ విద్యార్థి వీసాపై మార్చి 2014లో భారత్‌కు రాగా, అతని భార్య మే 2015లో మెడికల్ వీసాపై వచ్చారు. ఈ జంట వీసాల గడువు వరుసగా ఫిబ్రవరి 2017 మరియు సెప్టెంబర్ 2015లో ముగిసింది. పూణే పోలీసులు ఈ ఏడాది ఫిబ్రవరిలో లీవ్ ఇండియా నోటీసులు జారీ చేశారు. 14 రోజుల్లో భారత్ వదిలేయాలని ఆదేశించారు. పిటిషనర్లు ఆస్ట్రేలియాకు వీసా పొందే వరకు బహిష్కరణ నుండి రక్షణ కోరారు. శరణార్థి కార్డు హోల్డర్లను అనుమతించే 129 ఇతర దేశాలకు పిటిషనర్ వెళ్లవచ్చని పూణే పోలీసుల తరఫున వాదిస్తున్న ప్రత్యేక న్యాయవాది సందేశ్ పాటిల్‌తో ధర్మాసనం అంగీకరించింది. తాము మీకు 15 రోజుల కన్నా ఎక్కువ సమయం రక్షణ కల్పించలేమని కోర్టు చెప్పింది.
తాజావార్తలు
-
Bhagat Singh: నేటికీ భారత యువత నరనరాల్లో ప్రవహిస్తున్న విప్లవాగ్ని భగత్.. ఉరితాడును ముద్దాడిన వీరుడి కథ..
-
RBI Bank Holidays October 2026: అక్టోబర్‌లో బ్యాంకులకు వరుస సెలవులు.. దసరా, దుర్గాపూజ సెలవుల పూర్తి జాబితా
-
IND vs AFG: భారత్-అఫ్గానిస్థాన్ క్వార్టర్ ఫైనల్‌కు భారీ వర్షం ముప్పు.. మ్యాచ్ రద్దయితే ఏం జరుగుతుంది?
-
The Paradise : నష్టాల దిశగా ప్యారడైజ్.. సండే రోజు బిగ్ డ్రాప్
-
Gold Ring Scheme: పుట్టిన బిడ్డకు గోల్డ్ రింగ్.. కొత్త పథకానికి సీఎం విజయ్ శ్రీకారం
ట్రెండింగ్
-
Virat Kohli: నేను అలాంటి రకం కాదు.. అసలు విషయం చెప్పేసిన విరాట్ కోహ్లీ!
-
8.02 అంగుళాల డిస్ప్లే, 200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Vivo X Fold 6 లాంచ్ కు ముహూర్తం ఫిక్స్.!
-
Peri Peri Masala Recipe: ఫ్రెంచ్ ఫ్రైస్, చికెన్ స్నాక్స్ రుచి అదిరిపోయేలా.. ‘పెరి పెరి మసాలా’ను ఇంట్లోనే చేసుకోండి ఇలా..!
-
Asian Games 2026: నేడు అఫ్గాన్‌తో భారత్ ఢీ.. వైభవ్‌కు నిరాశ తప్పదు.. ప్లేయింగ్ 11, లైవ్ డీటెయిల్స్ ఇవే!
-
Shubman Gill: కోహ్లీ మాత్రమే కాదు.. అతను కూడా మ్యాచ్ గెలుపులో కీలక పాత్ర పోషించాడు..!