IND vs AFG: భారత్-అఫ్గానిస్థాన్ క్వార్టర్ ఫైనల్‌కు భారీ వర్షం ముప్పు.. మ్యాచ్ రద్దయితే ఏం జరుగుతుంది?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
What Happens If IND vs AFG Quarterfinal Is Washed Out: ఏషియన్ గేమ్స్ 2026 పురుషుల క్రికెట్లో భారత జట్టు తన తొలి మ్యాచ్‌కు సిద్ధమైంది. మరికొన్ని గంటల్లో అఫ్గానిస్థాన్‌తో భారత్ క్వార్టర్ ఫైనల్లో తలపడనుంది. నిషిన్‌లోని కొరోగి స్పోర్ట్స్ పార్క్ ఈ మ్యాచ్‌కు వేదిక. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతున్న భారత్.. ఈసారి కూడా స్వర్ణ పతకాన్ని నిలబెట్టుకోవాలని చూస్తోంది. అయితే మ్యాచ్‌కు వర్షం రూపంలో పెద్ద అడ్డంకి ఎదురయ్యే అవకాశం ఉంది.
మ్యాచ్‌కు వరుణుడి ముప్పు:
మ్యాచ్ జరిగే నిషిన్‌లో సోమవారం రోజంతా మేఘావృత వాతావరణం ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. భారీ వర్షంతో పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉంది. పలు సమయాల్లో భారీ వర్షం కురిసే అవకాశాలు ఉండటంతో.. మ్యాచ్ పూర్తిగా సాగుతుందా? లేదా వర్షం కారణంగా అంతరాయం ఏర్పడుతుందా? అనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే ఇదే వేదికపై పాకిస్థాన్, హాంకాంగ్ మధ్య జరగాల్సిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. టాస్ కూడా పడకుండానే మ్యాచ్‌ను నిలిపివేశారు. టోర్నీ నిబంధనల ప్రకారం మెరుగైన ర్యాంకింగ్ ఉన్న పాకిస్థాన్ సెమీఫైనల్‌కు అర్హత సాధించింది.
Also Read
- Virat Kohli: నేను అలాంటి రకం కాదు.. అసలు విషయం చెప్పేసిన విరాట్ కోహ్లీ!
- Six Centuries in One Day: సెంచరీల సండే.. ఒకే రోజులో 6 శతకాలు.. కోహ్లీ, గిల్ సహా దిగ్గజాల విధ్వంసం
- Asian Games 2026: నేడు అఫ్గాన్‌తో భారత్ ఢీ.. వైభవ్‌కు నిరాశ తప్పదు.. ప్లేయింగ్ 11, లైవ్ డీటెయిల్స్ ఇవే!
- Virat Kohli Records: "నువ్వు మామూలోడివి కాదు సామీ".. ఒక్క సెంచరీతో ఏకంగా 10 సంచలన రికార్డులు బద్దలు..!
భారత్-అఫ్గానిస్థాన్ మ్యాచ్ కూడా రద్దయితే?:
భారత్, అఫ్గానిస్థాన్ మధ్య క్వార్టర్ ఫైనల్ కూడా వర్షం కారణంగా పూర్తిగా రద్దయితే.. భారత్ సెమీఫైనల్‌కు చేరనుంది. టోర్నీ నిబంధనల ప్రకారం ఇరు జట్లలో మెరుగైన ఐసీసీ టీ20 ర్యాంకింగ్ ఉన్న జట్టుకు సెమీఫైనల్ బెర్త్ దక్కుతుంది. ప్రస్తుతం భారత్ ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో ఉండగా.. అఫ్గానిస్థాన్ 10వ స్థానంలో ఉంది. దీంతో మ్యాచ్ ఒక్క బంతి కూడా పడకుండా రద్దయినా భారత్‌కు సెమీఫైనల్ బెర్త్ దక్కుతుంది.
గత ఏషియన్ గేమ్స్‌లోనూ ఇదే తీరు:
వర్షం కారణంగా భారత్‌కు ఏషియన్ గేమ్స్‌లో ఇదే తరహా అనుభవం గతంలోనూ ఎదురైంది. హాంగ్జౌలో జరిగిన 2022 ఏషియన్ గేమ్స్‌లో పురుషుల క్రికెట్లో భారత్ స్వర్ణ పతకం సాధించింది. వర్షం కారణంగా అఫ్గానిస్థాన్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్ రద్దు కావడంతో.. మెరుగైన ర్యాంకింగ్ ఆధారంగా భారత్‌కు గోల్డ్ మెడల్ దక్కింది. ఈసారి కూడా క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయితే.. అదే నిబంధన భారత్‌కు అనుకూలంగా మారనుంది.
యువ ఆటగాళ్లపై భారీ అంచనాలు:
శ్రేయాస్ అయ్యర్ నాయకత్వంలోని భారత జట్టు డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగుతోంది. నాకౌట్ మ్యాచ్ కావడంతో భారత్ పూర్తి బలంతో ఆడాలని భావిస్తోంది. భారత్ గత ఏషియన్ గేమ్స్‌లో పురుషులు, మహిళల విభాగాల్లోనూ స్వర్ణ పతకాలు సాధించింది. ప్రస్తుత ఏషియన్ గేమ్స్‌లోనూ భారత మహిళల జట్టు శ్రీలంకను ఓడించి స్వర్ణ పతకాన్ని సాధించింది. ఇప్పుడు పురుషుల జట్టు కూడా అదే విజయాన్ని కొనసాగిస్తూ సెమీఫైనల్లోకి అడుగుపెట్టాలని చూస్తోంది. అయితే మ్యాచ్‌కు వర్షం ఎంతమేరకు అంతరాయం కలిగిస్తుందనేది కీలకంగా మారింది. వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తే భారత్, అఫ్గానిస్థాన్ మధ్య ఆసక్తికరమైన క్వార్టర్ ఫైనల్ పోరు జరగనుంది. ఒకవేళ మ్యాచ్ పూర్తిగా రద్దయితే మాత్రం ర్యాంకింగ్స్ ఆధారంగా భారత్ సెమీఫైనల్‌కు చేరుతుంది.
తాజావార్తలు
-
IND vs AFG: భారత్-అఫ్గానిస్థాన్ క్వార్టర్ ఫైనల్‌కు భారీ వర్షం ముప్పు.. మ్యాచ్ రద్దయితే ఏం జరుగుతుంది?
-
The Paradise : నష్టాల దిశగా ప్యారడైజ్.. సండే రోజు బిగ్ డ్రాప్
-
Gold Ring Scheme: పుట్టిన బిడ్డకు గోల్డ్ రింగ్.. కొత్త పథకానికి సీఎం విజయ్ శ్రీకారం
-
Virat Kohli: నేను అలాంటి రకం కాదు.. అసలు విషయం చెప్పేసిన విరాట్ కోహ్లీ!
-
8.02 అంగుళాల డిస్ప్లే, 200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Vivo X Fold 6 లాంచ్ కు ముహూర్తం ఫిక్స్.!
ట్రెండింగ్
-
Peri Peri Masala Recipe: ఫ్రెంచ్ ఫ్రైస్, చికెన్ స్నాక్స్ రుచి అదిరిపోయేలా.. ‘పెరి పెరి మసాలా’ను ఇంట్లోనే చేసుకోండి ఇలా..!
-
Asian Games 2026: నేడు అఫ్గాన్‌తో భారత్ ఢీ.. వైభవ్‌కు నిరాశ తప్పదు.. ప్లేయింగ్ 11, లైవ్ డీటెయిల్స్ ఇవే!
-
Shubman Gill: కోహ్లీ మాత్రమే కాదు.. అతను కూడా మ్యాచ్ గెలుపులో కీలక పాత్ర పోషించాడు..!
-
National Drink Beer Day : బీర్ కోసం ఓ రోజు.. National Drink Beer Day వెనుక కథ ఇదే.!
-
World Rabies Day 2026 : కుక్క కాటు.. ఈ 15 నిమిషాలు మిస్ అయితే డేంజర్.!