Gautam Adani: హిందువులు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే పూరీ జగన్నాథుడి రథయాత్రలో ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ కుటుంబం పాల్గొంది. శనివారం పూరీ రథయాత్రలో గౌతమ్ అదానీతో పాటు ఆయన భార్య ప్రతీ అదానీ, కుమారుడు కరణ్ అదానీలు పాల్గొన్నారు. జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రల ఊరేగింపుకు సంబంధించిన పూజా ఆచారాలకు వీరు హాజరయ్యారు. ఇదే కాకుండా, ప్రసాదం తయారు చేయడంలో అదానీ కుటుంబం పాలుపంచుకుంది.
ప్రపంచ ప్రఖ్యాత జగన్నాథ రథయాత్ర ప్రతి సంవత్సరం ఆషాఢ మాసం శుక్ల పక్ష రెండవ రోజున ప్రారంభమవుతుంది. ఈ యాత్ర ఈరోజు అంటే జూన్ 27న ప్రారంభమవుతుంది. ఈ మహా యాత్ర జూలై 8 వరకు కొనసాగుతుంది. 12 రోజుల పాటు జరిగే ఈ యాత్రలో జగన్నాథుడు, అతని సోదరుడు బలభద్రుడు, సోదరి సుభద్ర పూరి ఆలయం నుంచి గుండిచా ఆలయానికి వారి వారి రథాలపై ఊరేగుతారు. ఈ మహా యాత్ర సందర్భంగా.. జగన్నాథ ఆలయంలో 'ఛేరా…
Jagannath Temple: పూరీ జగన్నాథ ఆలయంలో ఎన్నో రహస్యాలకు కేంద్రంగా ఉంది. ఇక్కడ జరిగే ప్రతీది దైవత్వాన్ని సూచిస్తుంది. ఒడిశాలోని పూరీలో ప్రస్తుతం జగన్నాథుడి రథయాత్ర ప్రారంభమైంది. జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రల ఊరేగింపును చూసేందుకు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది పూరీకి చేరుకుంటారు.