Ramayana Trailer: లీకులకు భయపడి విడుదల చేశారా?.. ‘రామాయణం’ ట్రైలర్ స్ట్రాటజీపై నెట్టింట తీవ్ర చర్చ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ramayana Trailer: రణబీర్ కపూర్, సాయి పల్లవి, యశ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘రామాయణం’ ట్రైలర్ ఎట్టకేలకు విడుదలై సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు అద్భుతమైన విజువల్స్, గ్రాఫిక్స్, నటీనటుల లుక్స్ చూసి ప్రేక్షకులు ప్రశంసిస్తుంటే, మరోవైపు ఈ ట్రైలర్‌ను విడుదల చేసిన వ్యూహంపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వాస్తవానికి ఈ ట్రైలర్ జూలై 24నే రావాల్సి ఉన్నప్పటికీ, వాయిదాల పర్వం తర్వాత జూలై 30న తెల్లవారుజామున 4:15 గంటల బ్రహ్మముహూర్తంలో విడుదల చేశారు. మేకర్స్ దీనికి ఆధ్యాత్మిక కోణాన్ని జోడించినప్పటికీ, పరిశ్రమ వర్గాల్లో మాత్రం వేరే చర్చ నడుస్తోంది. హాలీవుడ్ చిత్రం ‘స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే’తో పాటు థియేటర్లలో ఈ ట్రైలర్‌ను ప్రదర్శించాల్సి ఉంది. ఆ ఉదయం థియేటర్ల నుంచి లీకైన క్లిప్‌లు సోషల్ మీడియాలో హల్చల్ చేయకముందే మేకర్స్ అధికారికంగా డిజిటల్‌గా విడుదల చేయక తప్పలేదని కొందరు భావిస్తున్నారు.
అంతేకాకుండా, భారత్‌లో ఉదయం 4:15 గంటలు అంటే అమెరికాలో అది సరిగ్గా ప్రైమ్ టైమ్ సాయంత్రం అవుతుంది. చిత్ర నిర్మాత నమిత్ మల్హోత్రా మొదటి నుంచీ చెబుతున్నట్లుగా ఈ సినిమా కేవలం భారతీయ మార్కెట్ కోసమే కాకుండా గ్లోబల్ ఆడియన్స్‌ను టార్గెట్ చేస్తూ ప్లాన్ చేశారు. విదేశీ ప్రేక్షకులను మెప్పించలేకపోతే అది తమ వైఫల్యమే అని ఆయన గతంలోనే పేర్కొన్నారు. అయితే ఇక్కడే భారతీయ ప్రేక్షకుల నుంచి అసంతృప్తి వ్యక్తమవుతోంది. ‘రామాయణం’ అనేది భారతీయులకు కేవలం ఒక సినిమా మాత్రమే కాదు, కోట్లాది మంది ఇలవేల్పుల భక్తి, నమ్మకాలతో ముడిపడి ఉన్న పవిత్ర కావ్యం. శ్రీరాముడు, సీతాదేవి, హనుమంతుడు మనకు పూజనీయులు. అటువంటి కథను ప్రపంచ వేదికపై చూపించే ప్రయత్నంలో, స్వదేశీ ప్రేక్షకుల భావోద్వేగాలను, ఉత్సాహాన్ని పక్కనపెట్టి కేవలం విదేశీ మార్కెట్ పైనే ఎక్కువ దృష్టి పెట్టారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Also Read
ఇప్పటికే కామిక్-కాన్ ఈవెంట్ నుంచి లీకైన వీడియోలు, నెగెటివ్ టాక్ తెచ్చుకున్న పాత టీజర్ వల్ల ట్రైలర్ పై ఉన్న కిక్ కొంతవరకు తగ్గిందనే చెప్పాలి. ఇక ట్రైలర్ విషయానికొస్తే విజువల్స్, ఏఆర్ రెహమాన్ – హన్స్ జిమ్మెర్ బిజీఎమ్, రణబీర్, సాయి పల్లవి, యశ్ లుక్స్ బాగున్నప్పటికీ.. కొన్ని సీజీఐ షాట్స్, క్యారెక్టర్ డిజైన్స్ పట్ల సోషల్ మీడియాలో భిన్నమైన రీతిలో మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. భారతీయ సంస్కృతిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లడం శుభపరిణామమే అయినా, ఆ రేసులో స్వదేశీ అభిమానుల అంచనాలను, సెంటిమెంట్లను మేకర్స్ అలసత్వం వహించారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం సినిమా కంటెంట్ కంటే మేకర్స్ అనుసరించిన ఈ రిలీజ్ స్ట్రాటజీ పైనే నెట్టింట ఎక్కువగా చర్చ జరుగుతోంది.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!