Freedom App: రైతులు, చిన్న వ్యాపారులు తమ ఆదాయాన్ని పెంపొందించుకునేందుకు, ఆర్థిక స్వేచ్ఛను సాధించడానికి దోహదపడుతున్న ఫ్రీడమ్ యాప్ కోటి డౌన్‌లోడ్‌లను దాటింది. ప్రారంభించిన 33 నెలల వ్యవధిలోనే ప్రజాధరణ పొందింది. ఇంగ్లీష్, తెలుగు, కన్నడ, హిందీ, తమిళం, మళయాళం వంటి స్థానిక భాషల్లో కూడా కంటెంటు రూపొందించడంతో ప్రజలకు చేరువైంది. ప్రస్తుతం వ్యవసాయం, వ్యాపారం రంగాల్లో 960 కోర్సులను కలిగి ఉంది.