Bombay High Court: ఒక బాలికను ఫాలో అయ్యాడనే ఒకే ఉదాహరణ అనేది ఐపీసీ సెక్షన్ 354(D) ప్రకారం ఒక బాలికను స్టాకింగ్(వెంబడించడం) చేశాడనే నేరంగా పరిగణించబడటానికి అనుగుణంగా లేదని బాంబే హైకోర్టు తీర్పునిచ్చింది. 14 ఏళ్ల బాలికకు సంబంధించిన కేసులో లైంగిక వేధింపులు, అతిక్రమణకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు 19 ఏళ్ల యువకులకు సంబంధించిన పిటిషన్ల జస్టిస్ జీఏ సనప్ విచారించారు.
Katrina Kaif: బాలీవుడ్ స్టార్ కపుల్ కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ కు హత్యా బెదిరింపులు రావడం ప్రస్తుతం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. కొన్నేళ్లు ప్రేమించుకున్న ఈ జంట గతేడాది డిసెంబర్ లో వివాహం చేసుకొని ఒక్కటయ్యారు. ఇక వివాహం అనంతరం హనీమూన్ ను ముగించుకొని ఎవరి కెరీర్ లో వారు బిజీగా ఉన్నారు.
ప్రముఖ మలయాళ నటి పార్వతి తిరువొత్తు లైంగిక వేధింపుల కేసులో పోలీసులను ఆశ్రయించింది. గతకొన్నిరోజుల నుంచి ఒక వ్యక్తి తనను తరుచు వేధిస్తున్నాడని తెలుపుతూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. హర్ష అనే 35 ఏళ్ళ వ్యక్తి తనను రోజు వేధిస్తున్నాడని, డెలివరీ బాయ్ అవతారం ఎత్తి ఫుడ్ పేరుతో నిత్యం ఇంటికి వస్తున్నదని ఫిర్యాదులో తెలిపింది. తాను, తన కుటుంబం ఎంత చెప్పినా అతను వినడం లేదని, అందుకే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఆమె పేర్కొంది.…