Pahalgam Terror Attack: 26 మంది టూరిస్టుల్ని బలితీసుకున్న పహల్గామ్ ఉగ్రదాడి టెర్రరిస్టులు చెన్నై మీదుగా శ్రీలంకకు చేరుకున్నారని భారత్ నుంచి వచ్చిన సమాచారం మేరకు శనివారం మధ్యాహ్నం కొలంబో విమానాశ్రయంలో భారీ తనిఖీలు జరిగాయి. ఉదయం 11.59 గంటలకు కొలంబోలోని బండరానాయకే అంతర్జాతీయ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న శ్రీలంక ఎయిర్ లైన్స్‌కి చెందిన UL122 విమానాన్ని భద్రతా దళాలు క్షుణ్ణంగా తనిఖీ చేశాయి.
Read Also: Manju Warrier : స్టార్ హీరోయిన్ నడుము గిల్లిన వ్యక్తి.. వీడియో వైరల్..
పహల్గామ్ ఉగ్రదాడికి పాల్పడిన ఆరుగురు అనుమానితులు విమానంలో ఉన్నారని భారత అధికారుల నుంచి శ్రీలంకకు హెచ్చరికలు వచ్చాయని అధికారులు తెలిపారు. అనుమానితులు శ్రీలంక ఎయిర్‌లైన్స్ విమానంలో కొలంబో వెళ్లినట్లు అనుమానిస్తున్నారు. శ్రీలంక పోలీసులు, ఎయిర్‌ఫోర్స్, విమానాశ్రయ భద్రతా సిబ్బంది సంయుక్తంగా ఈ సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయని నివేదికలు వెలువడ్డాయి. చెన్నై ఏరియా కంట్రోల్ సెంటర్ నుంచి తమకు హెచ్చరికలు అందినట్లు ఎయిర్‌లైన్స్ తెలిపింది.
26 మంది మరణించిన పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. ఈ దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులలో ఒకరిని హషీం ముసాగా గుర్తించారు. అతను పాకిస్తాన్ సైన్యం యొక్క మాజీ కమాండో అని సమాచారం. ఉగ్రవాదులు మతం ఆధారంగా హిందువుల్ని కాల్చి చంపారు. పాకిస్తాన్ కు చెందిన లష్కరే తోయిబా ఉగ్రసంస్థకు అనుబంధంగా పనిచేస్తు్న్న ‘‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్’’ ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడినట్లు ప్రకటించుకున్నారు.