Pahalgam Terror Attack: 26 మంది టూరిస్టుల్ని బలితీసుకున్న పహల్గామ్ ఉగ్రదాడి టెర్రరిస్టులు చెన్నై మీదుగా శ్రీలంకుకు చేరుకున్నారని భారత్ నుంచి వచ్చిన సమాచారం మేరకు శనివారం మధ్యాహ్నం కొలంబో విమానాశ్రయంలో భారీ తనిఖీలు జరిగాయి. ఉదయం 11.59 గంటలకు కొలంబోలోని బండరానాయకే అంతర్జాతీయ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న శ్రీలంక ఎయిర్ లైన్స్‌కి చెందిన UL122 విమానాన్ని భద్రతా దళాలు క్షుణ్ణంగా తనిఖీ చేశాయి.