ఛత్తీస్‌ఘడ్‌లోని సుక్మా జిల్లాలో మరోసారి మావోయిస్టులు రెచ్చిపోయారు. కొంటా బ్లాక్‌లోని పిట్ట గ్రామానికి చెందిన ఐదుగురు గ్రామస్థులను మావోయిస్టులు కిడ్నాప్ చేశారు. శుక్రవారం నలుగురిని కిడ్నాప్ చేయగా, శనివారం మరో గ్రామస్థుడిని కిడ్నాప్ చేసినట్లు సమాచారం.
కిడ్నాప్ చేసిన గ్రామస్థుల గురించి ఇప్పటివరకు ఎలాంటి సమాచారం లేదు. గ్రామస్తులందరినీ సురక్షితంగా విడుదల చేయాలని సర్వ ఆదివాసీ సమాజ్ నక్సలైట్లకు విజ్ఞప్తి చేసింది.