S Jaishankar: ప్రధాని నరేంద్రమోడీ ఈ నెల 21 నుంచి 24 వరకు అగ్రరాజ్యం అమెరికాలో పర్యటించనున్నారు. ఈ పర్యటన ఎంత ప్రతిష్టాత్మకమైందో వివరించారు విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్. ప్రధాని నరేంద్రమోడీ అమెరికా పర్యటనను ‘అత్యున్నత స్థాయి గౌరవం’గా ఆయన అభివర్ణించారు. యూఎస్ కాంగ్రెస్ సంయుక్త సమావేశంలో ప్రధాని నరేంద్రమోడీ ప్రసంగించనున్నారు. ఇలా రెండుసార్లు ప్రసంగించబోతున్న భారత ప్రధాని మోడీనే అని ఆయన అన్నారు. అంతకుముందు 2016లో అమెరికా కాంగ్రెస్ లో మోడీ ప్రసంగించారు.
ఏ భారత ప్రధాని కూడా అమెరికా కాంగ్రెస్ ఉభయసభల సంయుక్త సమావేశంలో ప్రసంగించలేదని, ప్రధాని మోడీనే మొదటివారని, ప్రపంచంలో చాలా తక్కువ మంది మాత్రమే రెండోసారి ప్రసంగించారని, వారిలో విన్‌స్టన్ చర్చిల్, నెల్సన్ మండేలా వంటి వారు ఉన్నారని ఆయన అన్నారు. అందుకే ఈ పర్యటనకు చాలా ప్రాముఖ్యత ఉందని జైశంకర్ తెలిపారు.
జూన్ 21 నుంచి జూన్ 24 వరకు ప్రధాని అమెరికా పర్యటన కొనసాగనుంది. అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్, ఫస్ట్ లేడీ జిల్ బిడెన్ ఆహ్మానం మేరకు ప్రధాని మోడీ అమెరికా పర్యటన వెళ్లనున్నారు. జూన్ 22న అమెరికా కాంగ్రెస్ ఉభయసభల సంయుక్త సమావేశంలో ప్రసంగించనున్నారు.జూన్ 22న ప్రధాని మోడీకి, అధ్యక్షుడు, ఫస్ట్ లేడీ దేశం తరుపున విందు ఇవ్వనున్నారు. ఇంతకుముందు ఇలా రెండుసార్లు మాత్రమే భారత నేతలకు విందు ఇచ్చారు. ప్రధాని మోడీ మూడోవారు. అంతకుముందు మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ కి జూన్ 1963లో, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కి నవంబర్ 2009లో వైట్ హౌజ్ లో విందు ఇచ్చారు.
PM will be on a state visit to the US. State visit means it is the highest level in terms of honour. Only a few people have been given this honour. It is happening for the first time that an Indian PM will address the US Congress for the second time. That's why its importance is… pic.twitter.com/0uj5YwRUi1
— ANI (@ANI) June 17, 2023