S Jaishankar: ప్రధాని నరేంద్రమోడీ ఈ నెల 21 నుంచి 24 వరకు అగ్రరాజ్యం అమెరికాలో పర్యటించనున్నారు. ఈ పర్యటన ఎంత ప్రతిష్టాత్మకమైందో వివరించారు విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్. ప్రధాని నరేంద్రమోడీ అమెరికా పర్యటనను ‘అత్యున్నత స్థాయి గౌరవం’గా ఆయన అభివర్ణించారు. యూఎస్ కాంగ్రెస్ సంయుక్త సమావేశంలో ప్రధాని నరేంద్రమోడీ ప్రసంగించనున్నారు.