Amarnath Yatra: పహల్గామ్ ఉగ్రదాడ నేపథ్యంలో గట్టి భద్రత మధ్య బుధవారం అమర్‌నాథ్ యాత్రకు సంబంధించి తొలి బృందం జమ్మూ నుంచి బయలుదేరుతోంది. 38 రోజుల పాటు సాగే ఈ యాత్ర గురువారం లాంఛనంగా ప్రారంభం కానుంది. శ్రీ అమర్‌నాథ్ జీ పుణ్యక్షేత్ర బోర్డు చైర్మన్ కూడా అయిన జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా బుధవారం పహల్గామ్ మరియు బల్తాల్‌లోని బేస్ క్యాంపుల నుంచి యాత్రికుల మొదటి బృందాన్ని జెండా ఊపి ప్రారంభిస్తారు.
Amarnath Yatra: హిందూ మతంలో అమర్‌నాథ్ యాత్రకు చాలా ప్రాముఖ్యత ఉంది. మంచుతో కూడిన శివలింగం రూపంలో శివుడు ఇక్కడ కూర్చుండడాన్ని ఎవరు చూస్తారో వారికి మోక్షం లభిస్తుందని భక్తుల నమ్మకం.