India-Bangladesh Border: భారత్-బంగ్లాదేశ్ సరిహద్దుల్లో మరోసారి ఉద్రిక్తత..
- భారత్-బంగ్లాదేశ్ సరిహద్దుల్లో మరోసారి ఉద్రిక్తత..
- ఘర్షణకు దిగిన ఇరు దేశాల రైతులు..
- రెండు దేశాల సరిహద్దు దళాల జోక్యంతో ముగిసిన వివాదం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India-Bangladesh Border: షేక్ హసీనా పదవి నుంచి దిగిపోయిన తర్వాత భారత్, బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ప్రస్తుతం మహ్మద్ యూనస్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం భారత వ్యతిరేక విధానాలను అవలంభిస్తోంది. ముఖ్యం పాకిస్తాన్‌తో సంబంధాలను బలోపేతం చేసుకుంటోంది. మరోవైపు ఆ దేశంలోని మైనారిటీలు, ప్రధానం హిందువులను టార్గెట్ చేస్తూ దాడులు చేస్తున్నారు. ఇక బంగ్లా మాజీ ఆర్మీ అధికారులు భారత్‌కి వార్నింగ్ ఇచ్చే స్థాయికి ఎదిగారు.
Read Also: Rahul Gandhi: “కులగణన”తో బీహార్ ప్రజలను మోసం చేశాడు.. నితీష్‌పై రాహుల్ గాంధీ ఆరోపణ
Also Read
- Anjanadri Temple: హనుమ జన్మస్థలంలోనే ఇంత మోసమా? అంజన్నకు నకిలీ ఆభరణాల విరాళం!
- AIADMK MLAs Support Vijay: అన్నాడీఎంకేలో భారీ చీలిక.. విజయ్ గూటికి 30 మంది ఎమ్మెల్యేలు..
- CM Vijay: సీఎం విజయ్ సంచలన నిర్ణయం.. మందుబాబులకు బిగ్ షాక్!
- Himanta Biswa Sarma: నేడు అస్సాం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న హిమంత బిస్వా శర్మ
దీనికి తోడు ఇటీవల భారత్-బంగ్లాదేశ్ సరిహద్దుల్లో కూడా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇటీవల సరిహద్దు ప్రాంతంలో మన దేశంలో బీఎస్ఎఫ్ కంచె నిర్మిస్తుంటే, దీనికి బోర్డర్ గార్డ్స్ బంగ్లాదేశ్(BGB) అభ్యంతరం చెప్పింది. ఇది వివాదానికి కారణమైంది. తాజాగా, సరిహద్దుల్లో ఇరు దేశాల రైతుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ సంఘటన సుఖ్‌దేవ్ పూర్ సరిహద్దు అవుట్‌పోస్ట్ సమీపంలో జరిగింది.
అంతర్జాతీయ సరిహద్దు వద్ద పనిచేసుకుంటున్న భారత రైతులు, బంగ్లాదేశ్ రైతులు తమ పంటను దొంగిలించారని ఆరోపించారు. దీంతో ఇరు దేశాల సైనికులు సరిహద్దు వద్దకు చేరుకుని ఘర్షణ పడ్డారు. రెండు వైపుల భారీ సంఖ్యలో జనాలు గుమిగూడారు. తిట్టుకుంటూనే, రాళ్లదాడులకు పాల్పడ్డారు. సకాలంలో BSF మరియు BGB సిబ్బంది జోక్యం చేసుకోవడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. భారత రైతులు ప్రశాంతంగా ఉండాలని, సరిహద్దు వివాదాల్లో పాల్గొనవద్దని అభ్యర్థించినట్లు బీఎస్ఎఫ్ చెప్పింది. ఏదైనా ఫిర్యాదులు ఉంటే అవసరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
తాజావార్తలు
-
Anjanadri Temple: హనుమ జన్మస్థలంలోనే ఇంత మోసమా? అంజన్నకు నకిలీ ఆభరణాల విరాళం!
-
Gayatri Gupta:“హగ్గులు లేకపోతే నిద్ర పట్టదు”.. గాయత్రీ గుప్తా ఓపెన్ కామెంట్స్!
-
AIADMK MLAs Support Vijay: అన్నాడీఎంకేలో భారీ చీలిక.. విజయ్ గూటికి 30 మంది ఎమ్మెల్యేలు..
-
Madhav Tiwari: నేను 4 ఓవర్లు బౌలింగ్ చేశా, ఇప్పటికీ నమ్మలేకపోతున్నా.. డీసీ ప్లేయర్ ఆనందం!
-
High Court: భర్తను కత్తితో పొడిచి చంపిన భార్య.. జస్ట్ రూ.500 జరిమానా విధించి నిర్దోశిగా తేల్చిన హైకోర్టు
ట్రెండింగ్
-
Palak Paratha Recipe: హెల్దీగా, టేస్టీగా చేసే సూపర్ సాఫ్ట్ ‘పాలక్ పరోటా’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Samsung: సర్టిఫైడ్ రీ-న్యూడ్ ప్రోగ్రామ్ తో రిఫర్బిష్డ్ గెలాక్సీ S25, గెలాక్సీ A56 మోడళ్లను తీసుకొచ్చిన శాంసంగ్..!
-
204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..
-
Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..
-
8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే, యాక్టివ్ కూలింగ్‌తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!