USA: “నువ్వు ముస్లింవా?” అని భారతీయుడిపై 15 సార్లు కత్తితో దాడి..
- అమెరికాలో భారతీయుడిపై కత్తిదాడి..
- ముస్లింవా? అని ప్రశ్నించి దాడికి పాల్పడ్డ అమెరికన్..
- విషమ పరిస్థితుల్లో ఉన్న బాధితుడు సోహైల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
USA: అమెరికాలో భారతీయుడిపై జాతి విద్వేష దాడి జరిగింది. ఉటా రాష్ట్రంలో ఓ భారతీయుడిని మతం అడిగి కత్తితో దాడి చేయడం కలకలం రేపింది. భారత్‌కు చెందిన సోహైల్ అనే వ్యక్తిని ‘‘నువ్వు ముస్లింవా?’’ అని అడిగి 15 సార్లు ఓ అమెరికన్ కత్తితో పొడిచాడు. ఈ ఘటన షాపింగ్ మాల్లో చోటుచేసుకుంది. పోలీసులు చెబుతున్న వివరాల ప్రకారం.. 48 ఏళ్ల పీటర్ మైఖేల్ లార్సెన్ అనే వ్యక్తి సోమవారం వెస్ట్ వ్యాలీ సిటీలోని వ్యాలీ ఫెయిర్ మాల్లో సోహైల్‌పై దాడికి పాల్పడ్డాడు.
ముందుగా మాల్లో సోహైల్‌తో మాట్లాడటం ప్రారంభించిన మైఖేల్ మాట్లాడటం ప్రారంభించాడు. ముందుగా మీరు ఎక్కడి నుంచి వచ్చారని ప్రశ్నించాడు. అందుకు సోహైల్ తాను భారత్ నుంచి వచ్చినట్లు చెప్పాడు. ఆ తర్వాత నువ్వు ముస్లింవా? అని ప్రశ్నించాడు. అందుకు అవును అని సమాధానం చెప్పగానే, మైఖేల్ తన వద్ద ఉన్న కత్తితో విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. ‘‘ముస్లింలను చంపాలనే ఈ దాడి చేశాను’’ అని నిందితుడు విచారణలో అంగీకరించినట్లు కోర్టు పత్రాల్లో పేర్కొన్నారు. దీంతో అతడిపై హత్యాయత్నం సహా పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి.
Also Read
- SIR Protest: 10న జంతర్‌మంతర్ దగ్గర సీజేపీ నిరసన.. పాల్గొననున్న మమత!
- El Nino: ‘ఎర్రగా మారిన ప్రపంచం’.. ‘‘సూపర్-డూపర్ ఎల్ నినో’’ ముప్పు.!
- Gyanesh Kumar: CEC జ్ఞానేష్ కుమార్‌కు భారీ మద్దతు.. SIRను సమర్థిస్తూ 42 మంది మాజీ జడ్జీల లేఖ..
- Mumbai: ‘సౌత్ ముంబై శుభ్రంగా ఉంటే సరిపోదు’.. చెత్త సమస్యపై బాంబే హైకోర్టు ఆగ్రహం
సోహైల్‌కు 15 కత్తిపోటు గాయాలు ఏర్పడ్డాయి. ఆయనకు పలుమార్లు సర్జరీలు నిర్వహించారు. ప్రస్తుతం, అతడు పరిస్థితి విషమంగా ఉందని వైద్యలు చెబుతున్నారు. దాడి తర్వాత పోలీసులు చేరుకునే లోపే స్థానికులు దుండగుడిని అదుపులోకి తీసుకున్నారు. సోహైల్‌కు కుటుంబంలో ఆయన ఒక్కరే సంపాదిసోతున్నారు. సోహైల్‌కు ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. ఈ కుటుంబానికి సహాయం చేయడానికి సహోద్యోగులు విరాళాలు సేకరించడం ప్రారంభించారు.
తాజావార్తలు
-
SS Rajamouli: బాహుబలి ‘కిలికి’ని మించేలా జక్కన్న సరికొత్త ప్రయోగం.. !
-
Nana Patekar: కార్గిల్ వార్‌లో నానా పటేకర్.. అల్విదా నానా భాయ్!
-
Christa Pike: మరణశిక్ష కోసం 2-సార్లు విషపు ఇంజెక్షన్లు.. అయినా, క్రిస్టా పైక్ ఎలా బతికింది.?
-
Nara Lokesh : ఏపీలో దుర్గాదేవి మండపాలకు మంత్రి నారా లోకేష్ తీపి కబురు
-
Saudi-Houthi: మరింత దూకుడు పెంచిన హౌతీలు.. రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడి!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!