Exit Polls: లోక్‌సభ ఎన్నికలు-2024కి సంబంధించి ఎగ్జిట్ పోల్స్‌లో సంచనల ఫలితాలు వెలువడుతున్నాయి. మరోసారి నరేంద్రమోడీ అధికారంలోకి రాబోతున్నారని మెజారిటీ సంస్థలు అంచనా వేస్తున్నాయి. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి మొత్తం 543 లోక్‌సభ సీట్లలో మ్యాజిక్ ఫిగర్ 272 స్థానాలను దాటుతుందని అన్ని ఎగ్జిట్ పోల్స్ తేల్చి చెబుతున్నాయి. సగటున చూస్తే బీజేపీ కూటమికి 365 స్థానాలు వస్తాయని, కాంగ్రెస్ నేతృత్వంలోని కాంగ్రెస్ కూటమి సగటున 142 సీట్లకే పరిమతం అవుతుందని చెబుతున్నాయి. ఇదిలా ఉంటే బీజేపీకి టార్గెట్‌గా ఉన్న ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఈ సారి బీజేపీ భారీ విజయాన్ని సాధించబోతోందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి.
Read Also: EXIT POLLS: మళ్లీ బీజేపీదే అధికారం.. ఎగ్జిట్ పోల్స్‌లో సంచలన ఫలితాలు..
ఒడిశాలోని మొత్తం 21 లోక్‌సభ స్థానాల్లో సగటున బీజేపీకి 15 సీట్లు, నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని బిజూజనతాదళ్(బీజేడీ)కి 3-8 సీట్లు వస్తాయని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. ఇండియా న్యూస్-డి-డైనమిక్స్ ఎగ్జిట్ పోల్స్ బీజేపీకి 13 సీట్లు, భారత్‌కు సున్నా, బీజేడీకి 8 సీట్లు ఇచ్చింది. జన్ కీ బాత్ బీజేపీకి 15-18 సీట్లు, భారత్‌కు సున్నా, బీజేడీకి 3-7 సీట్లు వచ్చాయి. న్యూస్ 24-టుడే చాణక్య బీజేపీకి 16, భారత్‌కు 1, బీజేడీకి 4 సీట్లు వస్తాయని అంచనా వేసింది.
మరోవైపు పశ్చిమ బెంగాల్లో ఈ సారి బీజేపీ భారీ విజయం సాధిస్తుందని అంచనాలు ఉన్నాయి. తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ)కి సీఎం మమతా బెనర్జీకి భారీ షాక్ ఇవ్వబోతున్నట్లు ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. ఇండియా టీవీ అంచనా ప్రకారం, బెంగాల్‌లోని మొత్తం 42 సీట్లలో బీజేపీ 22-26 వరకు గెలుస్తుందని చెప్పింది.