గత కొంతకాలంగా ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌పై పెద్ద చర్చ జరుగుతోంది.. దానికి కారణం ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధపపడం.. దీనిపై కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘమైన చర్చ కూడా సాగింది.. పీకే ముందు కండిషన్ల లిస్ట్ కూడా కాంగ్రెస్ పెట్టింది.. ఈ నేపథ్యంలో కీలక పరిణామం చోటు చేసుకుంది.. కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు నిరాకరించారు పీకే.. దీనిపై సోషల్ మీడియా వేదికగా స్పందించింది కాంగ్రెస్ పార్టీ.. ప్రశాంత్ కిషోర్ నిర్ణయాన్ని తాము గౌరవిస్తామంటూ కాంగ్రెస్ నేత రణదీప్ సింగ్ సూర్జేవాలా ట్వీట్ చేశారు.
Read Also: TRS Plenary: పార్టీ శ్రేణులు, ప్లీనరీ ప్రతినిధులకు కేటీఆర్ కీలక సూచనలు
కాగా, పార్టీలో పీకేను చేర్చుకోవడంపై అంతర్గతంగా కూడా పెద్ద ఎక్సైజ్ జరిగింది.. కమిటీ కూడా వేశారు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ.. ఆ కమిటీ కూడా పీకేను పార్టీలో చేర్చుకోవాలని సోనియా గాంధీకి నివేదిక ఇచ్చింది.. దీంతో, పార్టీలో చేరాలని పీకేను సోనియా ఆహ్వానించడం కూడా జరిగింది.. కానీ, కాంగ్రెస్‌లో చేరాలన్న ప్రతిపాదనను తిరస్కరించారు పీకే.. సలహాదారుడిగా మాత్రమే కొనసాగేందుకు పీకే నిర్ణయం తీసుకున్నారు.. అయితే, పీకే నిర్ణయాన్ని గౌరవిస్తామని.. ఆయన సలహాలు తీసుకుంటామని కాంగ్రెస్ ప్రకటించింది. పార్టీ కోసం ప్రశాంత్ కిషోర్ తీసుకున్న శ్రమ, ఆయన పార్టీకి సలహాలను ఇచ్చినందుకు కాంగ్రెస్ పార్టీ ఆయనను అభినందిస్తోందని సూర్జేవాలా తన ట్వీట్‌లో పేర్కొన్నారు. అయితే, ఈ ఎపిసోడ్‌లో పీకే హైదరాబాద్ టూర్ పెద్ద చర్చగా మారింది.. ఎందుకంటే.. అప్పటి వరకు కాంగ్రెస్‌లో చేరేందుకు సానుకూలంగానే ఉన్నట్టు కనబడినా.. కేసీఆర్‌తో సుదీర్ఘ చర్చల తర్వాత పీకే తన నిర్ణయాన్ని మార్చుకున్నారా? అనేది ఆసక్తికరంగా మారింది.