వంట నూనెల ధరలు మరింతగా తగ్గనున్నాయి. విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న ముడి వంట నూనెల ధరలు అంతర్జాతీయంగా తగ్గుముఖం పట్టడంతో దేశంలో వంట నూనెల ధరలు దిగిరానున్నాయి. దేశీయంగా వంట నూనెల గరిష్ట రిటైల్ ధర( ఎంఆర్పీ)ని లీటర్ కు రూ.15 తగ్గించాలని ఎడిబుల్ ఆయిల్ అసోసియేషన్ లను వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఫుడ్ అండ్ సివిల్ సప్లై ఆదేశించింది. శుక్రవారం రోజున తయారీదారులు, రిఫైనలరీలకు, పంపిణీదారులు తగ్గించిన ధరను వెంటనే అమలు చేయాలని…