Uber And Ola: ఇటీవల ఆండ్రాయిడ్, ఐఫోన్ ఫోన్లను బట్టి వేర్వేరు ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు ఓలా, ఉబర్‌పై ఆరోపణలు వచ్చాయి. రైడ్ బుక్ చేసుకోవడానికి ఉపయోగించే మొబైల్ పరికరాల మోడళ్లను బట్టి వేర్వేరు ధరలు వసూలు చేస్తున్నట్లు వస్తున్న ఆరోపణలపై కేంద్రం స్పందించింది. రెండు సంస్థలుకు వినియోగదారుల మంత్రిత్వ శాఖ గురువాం నోటీసులు జారీ చేసింది.
భారత్‌లో త్వరలో పండుగల సీజన్ ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి ఈ-కామర్స్ కంపెనీలు తమ సన్నాహాలు ప్రారంభించాయి. ఇందులో తమ సేల్‌ను ప్రకటించిన ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి పేర్లు కూడా ఉన్నాయి.
Ration Card: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘వన్ నేషన్, వన్ రేషన్ కార్డ్’ పథకం ఇప్పుడు దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది. ఇప్పుడు దేశం మొత్తం ఈ పథకం పరిధిలోకి వచ్చిందని ఆర్థిక మంత్రిత్వ శాఖ శనివారం ప్రకటించింది.
Inflation: పండుగల సీజన్‌లో మిఠాయిలకే ఎక్కువ ఖర్చు అవుతుంది. రక్షాబంధన్, జన్మాష్టమి, దసరా, దీపావళి సందర్భంగా మిఠాయిలకు గిరాకీ ఉండడంతో ధరల్లో పెరుగుదల కనిపిస్తోంది.
వంట నూనెల ధరలు మరింతగా తగ్గనున్నాయి. విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న ముడి వంట నూనెల ధరలు అంతర్జాతీయంగా తగ్గుముఖం పట్టడంతో దేశంలో వంట నూనెల ధరలు దిగిరానున్నాయి. దేశీయంగా వంట నూనెల గరిష్ట రిటైల్ ధర( ఎంఆర్పీ)ని లీటర్ కు రూ.15 తగ్గించాలని ఎడిబుల్ ఆయిల్ అసోసియేషన్ లను వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఫుడ్ అండ్ సివిల్ సప్లై ఆదేశించింది. శుక్రవారం రోజున తయారీదారులు, రిఫైనలరీలకు, పంపిణీదారులు తగ్గించిన ధరను వెంటనే అమలు చేయాలని…