Mamata Banerjee: లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కనీసం 40 సీట్లు గెలుస్తుందా.? మమతా సవాల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mamata Banerjee: బీజేపీని గద్దె దించాలని, ప్రధాని నరేంద్రమోడీకి అధికారాన్ని దూరం చేయాలని ప్రతిపక్షాలు అన్నీ కలిసి ‘ఇండియా కూటమి’ని ఏర్పాటు చేశాయి. అయితే, ఇటీవల కాలంలో కూటమిలో విబేధాలు తారాస్థాయికి చేరినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కూటమి ఏర్పాట్లలో ముఖ్య భూమిక పోషించిన బీహార్ సీఎం నితీష్ కుమార్ మరోసారి ఎన్డీయే కూటమితో జతకట్టారు. ఇక బెంగాల్ సీఎం, టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ, ఆప్ పార్టీలు కాంగ్రెస్‌తో సీట్లను పంచుకోమని తెగేసి చెప్పాయి.
Read Also: Vijay: హీరో విజయ్ కొత్త పార్టీపై అన్నాడీఎంకే కీలక వ్యాఖ్యలు
Also Read
- CM Vijay: సీఎం విజయ్ చేతిలో విరాట్ కోహ్లీ సైన్ చేసిన బ్యాట్.. సోషల్ మీడియాను ఊపేస్తున్న ఫొటో..
- Abhijit Dipke: "నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ చేశారు".. కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు సంచలన ఆరోపణలు
- Delhi Heatwave: ఢిల్లీలో నిప్పుల కొలిమి.. తారు రోడ్ల ఏకంగా 65°C ఉష్ణోగ్రత నమోదు!
- CNG Price Hike: సీఎన్జీ వాహనదారులకు మళ్లీ షాక్.. మరోసారి పెరిగిన ధరలు
ఇదిలా ఉంటే, తాజాగా బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత మమతా బెనర్జీ కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌తో పొత్తు విబేధాల తర్వాత ఆమె ఆ పార్టీపై మరింత ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ 40 సీట్లు అయినా గెలుచుకుంటుందా అనే సందేహాన్ని వ్యక్తం చేశారు.
బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌లో జరిగిన బహిరంగ సభలో బెనర్జీ మాట్లాడుతూ..‘‘ కాంగ్రెస్ 300 సీట్లలో 40 సీట్లు గెలుస్తారో లేదో నాకు తెలియదు. ఎందుకు అంత అహంకారం.? మీరు బెంగాల్ వచ్చారు. మనం ఇండియా కూటమిలో ఉన్నాము, కనీసం నాకు చెప్పంది. మీకు దమ్ముంటే వారణాసిలో బీజేపీని ఓడించండి. మీరు గతంలో గెలిచిన చోట్ల ఓడిపోతారు.’’ అని అన్నారు. ఉత్తర ప్రదేశ్‌లో ఒక్క స్థానం లేదు, రాజస్థాన్‌లో మీరు గెలవలేదు, వెళ్లి ఆ సీట్లు గెలవండి, మీకు ఎంత ధైర్యం ఉందో చూస్తాను, వారణాసి, అలహాబాద్‌లో గెలవాలని, మీకు ఎంత ధైర్యం ఉందో చూస్తాను అని ఆమె సవాల్ విసిరారు.
తాజావార్తలు
-
Arava Sridhar Resignation: ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌తో పవన్ కల్యాణ్ భేటీ.. పదవికి రాజీనామా..
-
Peddi Censor Report: ‘పెద్ది’కి U/A సర్టిఫికేట్.. కానీ ఈ సీన్లపై సెన్సార్ కత్తెర
-
Dahi Masala Khichdi Recipe: వేసవిలో చల్లదనం ఇచ్చే దహీ మసాలా కిచిడి.. రుచితో పాటు ఆరోగ్యానికి మేలు చేస్తుంది..
-
Rukmini Vasanth: AI డీప్‌ఫేక్ బికినీ వీడియో పై..క్లారిటీ ఇచ్చిన రుక్మిణి వసంత్
-
Hyderabad: నెంబర్ ప్లేట్ లేని కారుతో ఢీ.. నగరంలో న్యాయవాది దారుణ హత్య!
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్‌తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్‌తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!