Prabhas: “నా జీవితంలో ప్రభాస్ దేవుడిలాంటి వ్యక్తి”
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Prabhas: ప్రముఖ నటుడు ప్రభాస్ శ్రీను తాజాగా ఎన్టీవీ పాడ్‌కాస్ట్‌లో తన సినీ ప్రయాణం, ప్రభాస్‌తో ఉన్న అనుబంధం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు వచ్చిన గుర్తింపు మొత్తం ప్రతిభ కంటే అదృష్టం వల్లే వచ్చిందని, ముఖ్యంగా ప్రభాస్ పరిచయం తన జీవితాన్ని పూర్తిగా మార్చేసిందని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “నాకు వచ్చిన ఈ గుర్తింపు, వికీపీడియా పేజీ, అవకాశాలన్నీ నా టాలెంట్ వల్ల మాత్రమే కాదు. ఇది పూర్తిగా నా అదృష్టం. ప్రపంచంలో ప్రతి ఒక్కరిలోనూ టాలెంట్ ఉంటుంది. కానీ అందరికీ అలాంటి అవకాశాలు రావు. నా జీవితంలో ప్రభాస్ తగలడం నా పెద్ద లక్” అని చెప్పారు. తన రోజువారీ జీవితాన్ని వివరిస్తూ.. ఉదయం స్నేహితులతో కలిసి బైక్ రైడింగ్, బ్యాడ్మింటన్ ఆడటం, తర్వాత షూటింగ్‌లకు వెళ్లడం, అక్కడి నుంచి ప్రభాస్‌తో కలిసి ప్రయాణాలు చేయడం ఇది తన రోజూ వారి జీవితం అని అన్నారు. “ఒకవైపు సాధారణ జీవితం, మరోవైపు పాన్ ఇండియా స్టార్‌తో కలిసి ప్రపంచవ్యాప్తంగా ట్రావెల్ చేయడం.. ఈ రెండు అనుభవాలు ఒకేసారి నా జీవితంలో ఉండటం అదృష్టంగా భావిస్తాను” అని అన్నారు.
ప్రభాస్‌తో తన బంధం గురించి మాట్లాడుతూ.. “ఆయన చుట్టూ చాలా మంది ఉంటారు. కానీ ఎవరు ఆయనకు దగ్గరవుతారనేది చెప్పడం కష్టం. ప్రభాస్‌కు నిజాయితీ అంటే చాలా ఇష్టం. ఆయన చాలా తెలివైన వ్యక్తి. ప్రతి విషయాన్ని చాలా లోతుగా గమనిస్తారు. మా ఇద్దరి మధ్య బంధం ఎలా ఏర్పడిందో నేను కూడా చెప్పలేను. అది అనుభవించాల్సిందే” అని పేర్కొన్నారు. ప్రభాస్‌ను దేవుడితో పోల్చడంపై స్పందిస్తూ.. “నేను ఆయన ఫ్రెండా, మేనేజరా, ఇంకేదైనా బంధమా అనేది చెప్పలేను. నేను ఆయనతో ఉండటం, అవసరమైనప్పుడు సేవ చేయడం అంతే. నా జీవితంలో ఆయన స్థానం చాలా ప్రత్యేకం. అందుకే ఆయనను దేవుడిలా భావిస్తాను. అలాంటి బంధాన్ని మాటల్లో చెప్పడం కష్టం” అని ప్రభాస్ శ్రీను భావోద్వేగంగా చెప్పారు.
Also Read
- Dada: బాలయ్య ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్... హైదరాబాద్‌లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
- Haindava Teaser: "ఆ దేవుళ్ల విగ్రహాల్లో దాగి ఉన్న రహస్యమేంటి?".. ‘హైందవ’ టీజర్ చూశారా!
- Prabhas Surprise: ఇమాన్వీకి ప్రభాస్ బర్త్‌డే గిఫ్ట్.. ఫిదా అయిన హీరోయిన్!
- Radha Krishna: చాలా కాలం తర్వాత మీడియా ముందుకు రాధే శ్యామ్ దర్శకుడు
తాజావార్తలు
-
AP Local Body Elections: కూటమి సీట్ల సర్దుబాటు దాదాపు ఖరారు.. జనసేన, బీజేపీకి ఎన్ని స్థానాలంటే?
-
India vs West Indies: మ్యాచ్ ఓడినా.. ఉప్పల్‌లో రికార్డుల మోత.. టీ20ల్లో భారత్ మరో ఘనత..
-
US: హిందూ దేవాలయంపై కాల్పులకు కుట్ర.. యువకుడు అరెస్ట్
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్‌గా పెంచుకోండి..
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..