Gold and Silver Price Today: బంగారం, వెండి ధరలకు మళ్లీ రెక్కలు.. రెండో రోజూ భారీ పెరుగుదల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gold and Silver Price Today: బంగారం, వెండి ధరల్లో ఒడిదుడుకులు కొనసాగుతూనే ఉన్నాయి.. కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం, వెండి ధరలు వరుసగా రెండో రోజూ పెరిగాయి. ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,420 పెరిగి రూ.1,55,990కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,300 పెరిగి రూ.1,43,000గా నమోదైంది. ముంబైలోనూ బంగారం ధరలు ఇదే స్థాయిలో పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.1,420 పెరిగి రూ.1,55,840కి చేరుకోగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,300 పెరిగి రూ.1,42,850గా కొనసాగుతోంది. ఇక, వెండి ధర కూడా భారీగా పెరిగింది. ఢిల్లీ, ముంబై మార్కెట్లలో కిలో వెండి ధర రూ.5,000 పెరిగి రూ.2,55,000కు చేరుకుంది. దీంతో వరుసగా రెండో రోజు బులియన్ మార్కెట్లో ధరల పెరుగుదల కనిపించింది.
ఇక, హైదరాబాద్ బులియన్ మార్కెట్లో రూ.1,580 పెరిగి రూ.1,54,420కు చేరుకుంది 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర.. ఇదే సమయంలో రూ.1,450 పెరిగి రూ.1,41,550కి ఎగసింది.. 10 గ్రాముల 22 క్యారెట్ల ధర.. మరోవైపు.. రూ.1,190 పెరిగి.. రూ.1,15,820గా ఉంది.. 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర.. ఇక, వెండి రూ.5000లు పెరగడంతో కిలో వెండి ధర రూ.2,60,000కు పెరిగింది..
Also Read
- Gold Rate Today: స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు.. నేటి 18, 22, 24 క్యారెట్ల రేట్లు ఇవే..
- Gold Silver Price Today: పడిపోతున్న పసిడి ధర.. వరుసగా రెండో రోజూ భారీగా డౌన్
- Gold and Silver Prices Fall: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు..
- Gold and Silver Prices Today: గుడ్ న్యూస్.. బంగారం, వెండి ధరలు భారీగా పతనం..
అంతర్జాతీయంగా ద్రవ్యోల్బణం కొనసాగుతుండటం, కేంద్ర బ్యాంకుల వడ్డీ రేట్లపై సంకేతాలు, కేంద్ర బ్యాంకుల బంగారం కొనుగోళ్లు, భౌగోళిక ఉద్రిక్తతలు, పెరుగుతున్న రుణభారం వంటి అంశాలు బంగారానికి మద్దతుగా నిలుస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. వడ్డీ రేట్లు పెరిగే పరిస్థితుల్లోనూ బంగారం తన బలాన్ని కొనసాగిస్తోందని SMC Global Securities కమోడిటీ రీసెర్చ్ హెడ్ వందనా భారతి పేర్కొన్నారు. మరోవైపు నాలుగో త్రైమాసికంలో భారత్, చైనా, యూరప్‌లో పండుగల సందర్భంగా సంప్రదాయ బంగారం కొనుగోళ్లు పెరిగే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషణలు సూచిస్తున్నాయి. దీంతో రాబోయే రోజుల్లో బంగారం, వెండి ధరల కదలికలు మార్కెట్ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
తాజావార్తలు
-
Jupally Krishna Rao : బార్ యజమానులకు షాక్.. ప్రివిలేజ్ ఫీజుపై జూపల్లి క్లారిటీ
-
SIR Row: ‘‘విజయ్‌కు భయపడుతున్నారా?’’.. రాహుల్ గాంధీని ప్రశ్నించిన డీఎంకే..
-
Asim Munir: అసిమ్ మునీర్ వింత ఆలోచన.. డ్రోన్ల కట్టడికి వెరైటీ ప్లాన్
-
Husharu 2: బీరు కోసం ‘క్షీరసాగర మథనం’.. కల్ట్ సీక్వెల్లో షాకింగ్ మార్పులు: ‘హుషారు 2’ పోస్టర్ వెనుక కథేంటి?
-
Fraud: విదేశాల్లో ఉద్యోగాలంటూ మోసం.. నిరుద్యోగుల నుంచి రూ.50 లక్షలు వసూలు చేసిన కేటుగాడు..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!