Kiren Rijiju: రాజ్యసభలో వక్ఫ్ సవరణ బిల్లు-2025, ది ముస్లమాన్ వక్ఫ్ రద్దు బిల్లు-2025 రెండు బిల్లులను పార్లమెంటరీ, మైనారిటీ వ్యవహరాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ప్రవేశ పెట్టారు. వక్ఫ్ సవరణ బిల్లు, యూనిఫైడ్ వక్ఫ్ మేనేజ్మెంట్, ఎంపవర్మెంట్, ఎఫీసియన్సీ అండ్ డెవలప్మెంట్ ( ఉమీద్) బిల్లుగా పిలుస్తారు అని పేర్కొన్నారు. వక్ఫ్ బిల్లుపై చర్చ కోసం రాజ్యసభలో సుమారు 8 గంటల సమయం కేటాయించినట్లు పేర్కొన్నారు. అలాగే, వక్ఫ్ బిల్లు పూర్వాపరాలను రాజ్యసభలో పార్లమెంటరీ, మైనారిటీ వ్యవహరాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు వివరించారు.
Read Also: Mallikarjun Kharge: రాజ్యసభలో ఇంట్రెస్టింగ్ సీన్.. మల్లికార్జున్ ఖర్గే నోట ‘పుష్ప’ డైలాగ్
అయితే, వక్ఫ్ సవరణ బిల్లుపై రాజ్యసభలో సుదీర్ఘంగా చర్చ జరిగిన తర్వాత ఓటింగ్ జరగనుంది. ఇక, రాజ్యసభలో ప్రస్తుతం 236 మంది సభ్యులు ఉండగా.. బిల్లు ఆమోదానికి 119 మంది సభ్యుల బలం అవసరం ఉంది. ఎన్డీయేకి రాజ్యసభలో 126 మంది సభ్యులు ఉన్నారు. నిన్న లోక్ సభలో ఈ బిల్లుపై చర్చ జరిగిన తర్వాత అనుకూలంగా 288 ఓటు వేయగా.. వ్యతిరేకంగా 232 ఓట్లు పడ్డాయి. ఈ బిల్లు రాజ్యాంగ విరుద్ధమని లోక్ సభలో విపక్షాలు తీవ్రంగా మండిపడ్డాయి. మైనార్టీలపై బీజేపీ కక్షసాధింపు చర్యలకు దిగుతుందని ఆరోపించారు.