Delhi: మనలో చాలా మంది దూర ప్రాంతాలకు ప్రయాణం చేసేందుకు రైలు మార్గాన్నే ఎన్నుకుంటారు. ఎందుకంటే బస్సు టికెట్ కంటే రైలు టికెట్ ధర తక్కువ.. అలానే అన్ని సౌకర్యాలు ఉంటాయి. అందుకే మధ్యతరగతి ప్రజలు పేద ప్రజలు ఎక్కువగా రైలు ప్రయాణాన్ని ఇష్టపడతారు. నిత్యం ఎంతో మంది రైలులో ప్రయాణిస్తుంటారు. తాజాగా బుధవారం ఓ ప్రకటనలో పాల్గొన్న రైల్వేశాఖ.. రైలు ప్రయాణికుల సంఖ్య గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 41 కోట్ల పెరిగినట్లు వెల్లడించింది. రైల్వేశాఖ వివరాల ప్రకారం.. ఏప్రిల్-అక్టోబరు మధ్య రైల్లో సాధారణ, స్లీపర్‌క్లాస్ లో ప్రయాణించిన ప్రయాణికుల సంఖ్య 38 కోట్లు కాగా ఏసీ కోచ్‌లలో ప్రయాణించే వారి సంఖ్య 3 కోట్ల మేర పెరిగింది. అనగా ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఏడు నెలల్లో సాధారణ, స్లీపర్ తరగతుల్లో 372 కోట్ల మంది, ఏసీ తరగతుల్లో 18.2 కోట్ల మంది ప్రయాణించినట్లు రైల్వేశాఖ తెలిపింది.
Read also:Bajaj Finance : బజాజ్ ఫినాన్స్ కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన ఆర్బీఐ
కాగా మొత్తం ప్రయాణికుల్లో 95.3% మంది సాధారణ, స్లీపర్ క్లాస్‌లలో ప్రయాణించగా.. 4.7% మంది ఏసీ కోచ్‌లలో ప్రయాణం చేసినట్లు తెలిపింది. అయితే గత ఏడాది ఇదే సమయానికి సాధారణ తరగతుల్లో 334 కోట్లమంది.. ఏసీ తరగతుల్లో 15.1 కోట్లమంది రాకపోకలు సాగించారు. కాగా ఈ సంవత్సరం మొత్తం 41.1 కోట్ల మంది ప్రయాణికులు పెరగ్గా అందులో 92.5% మంది సాధారణ తరగతుల్లో ప్రయాణించిన వారే ఉన్నారు. అయితే కొవిడ్ ముందు వరకు 10,186 రైళ్లు ఉండేవి. ప్రస్తుతం ఆ రైళ్ల సంఖ్య 10,748 పెరిగింది. వాటిలో ఎక్స్‌ప్రెస్ రైళ్లు 20.02% కాగా సబర్బన్ రైళ్లు 2.6% అలానే ప్యాసింజర్ రైళ్లు 2.1% పెరిగాయి.