Supreme Court: దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యంతో ప్రజలు నిత్యం తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు. కాలుష్య నియంత్రణకు గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్-4 నిబంధనలు విధించడంతో.. ప్రస్తుతం సత్ఫలితాలు ఇచ్చింది. దీంతో జీఆర్‌ఏపీ-4 ఆంక్షల సడలింపుకు అత్యున్నత న్యాయస్థానం పర్మిషన్ ఇచ్చింది.
Air Quality: దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యంతో పాటు పొగ మంచు రోజురోజుకు పెరుగుతోంది. ఆదివారం నగరాన్ని పొగమంచు కమ్మేయడంతో సమీప వాహనాలు కూడా కనిపించని దుస్థితి నెలకొంది. దీంతో ఇందిరాగాంధీ అంతర్జాతీయ ఎయిర్ పోర్టులో మూడు విమానాలను రద్దు చేయగా.. మరో 107 విమాన సర్వీసులు ఆలస్యంగా నడుస్తాయని అధికారులు తెలిపారు.