Delhi Weather: ఢిల్లీని గజగజలాడిస్తున్న చలి.. వేసవిలో 6 ఏళ్ల నాటి రికార్డ్ బద్దలు
- ఢిల్లీని గజగజలాడిస్తున్న చలి
- ఆహ్లాదకరంగా మారిన వాతావరణం
- వేసవిలో 6 ఏళ్ల నాటి రికార్డ్ బద్దలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ రాజధాని ఢిల్లీలో విచిత్రమైన వాతావరణం నెలకొంది. రెండ్రోజుల క్రితం వరకు ఎండలు మండిపోయాయి. బయటకు రావాలంటేనే బెంబేలెత్తిపోయారు. అంతగా వేడిగాలులతో నగర వాసులు ఇబ్బందిపడ్డారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తి భిన్నంగా మారిపోయింది. రెండు రోజుల నుంచి ఏకధాటిగా వర్షం కురుస్తోంది. దీంతో ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలో వాతావరణం ఆహ్లాదకరంగా మారిపోయింది. ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు 10 డిగ్రీలకు పడిపోయింది. దీంతో చల్లని గాలులు వీచడంతో ఉల్లాస భరితంగా మారిపోయింది.
ఎప్పుడూ మార్చి నెలలో ఢిల్లీలో తీవ్రమైన ఉక్కపోతతో అల్లాడిపోయి నగర వాసులు.. తాజాగా చలి యూ-టర్న్ తీసుకోవడంతో ప్రజలు గజగజ వణికిపోతున్నారు. ఉష్ణోగ్రత 21.7 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. దీంతో 2020 మార్చి 8 నాటి రికార్డును మార్చి 20న ఆరేళ్ల తర్వాత బద్దలైంది. రెండు రోజుల నుంచి సాధారణం కంటే 22 శాతం అధిక వర్షపాతం నమోదు కావడంతో వాతావరణంలో ఈ మార్పులు చోటుచేసుకున్నాయి.
Also Read
- PM Modi: ఢిల్లీలో నిరసనలు.. చెన్నైలో Gen Zతో మోడీ ముచ్చట్లు.!
- Police VS CJP: అభిజిత్ దీప్కే ఆరోపణలు.. సాక్ష్యంగా ఢిల్లీ పోలీసులు వీడియో రిలీజ్.
- Mahant Rajudas: మోడీ జీ, అలాంటి జెన్-జీపై చర్యలు తీసుకోండి.. సీజేపీపై మహంత్ రాజూదాస్ ఆగ్రహం..
- Abhijeet Dipke: ‘‘సంతకం చేయలేదు, మళ్లీ వీధుల్లోకి వస్తాం’’.. CJP దీప్కే సంచలన ప్రకటన.!
సహజంగా మార్చి నెలలో ఢిల్లీలో తీవ్రమైన వేడి గాలులు ఉంటాయి. అధిక విద్యుత్ అవసరం ఉంటుంది. ఫ్యాన్లు, ఏసీలు ఎక్కువ వాడడంతో విద్యుత్ డిమాండ్ పెరుగుతుంది. కానీ ప్రకృతిలో అకస్మాత్తుగా మార్పులు రావడంతో తిరిగి దుప్పట్లు, కంబళ్లు బయటకు తీయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఈసారి ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్ నుంచి భారతదేశం వరకు దాదాపు 1,000 కిలోమీటర్ల మేర ఒక సరళ ద్రోణిని విస్తరించి ఉంది. అంతేకాకుండా ఎత్తైన ప్రదేశాల్లోని మంచు గాలులు, అనేక చిన్న, పెద్ద తుఫాను వలయాల కలయిక వాతావరణాన్ని మరింత తీవ్రతరం చేసింది. ఈ కారణంగానే జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లోని పర్వత ప్రాంతాల్లో భారీ హిమపాతం కురుస్తుండగా.. ఢిల్లీతో సహా మైదాన ప్రాంతాల్లో వర్షాలు, వడగళ్ల వానలు కురుస్తున్నాయి.
ఇక మార్చి 21 నుంచి ఆకాశం క్రమంగా ఉంటుందని.. సూర్యుడు యధావిధిగా ప్రకాశిస్తాడని వాతావరణ శాఖ తెలిపింది. మార్చి 22వ తేదీ నుంచి ఉష్ణోగ్రతలు మళ్లీ పెరగడం ప్రారంభమవుతాయని.. మార్చి 23 నుంచి 26వ తేదీ మధ్య గరిష్ట ఉష్ణోగ్రతలు 30 నుంచి 33 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకుంటాయని అంచనా వేసింది.
#WATCH | Uttar Pradesh: A layer of fog hovers over Noida this morning. Visuals from Sector 122. pic.twitter.com/oTlXtzzJ52
— ANI (@ANI) March 21, 2026
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!