Delhi: ఢిల్లీ మేయర్ ఎన్నికల్లో ఆప్ విజయం.. మహేశ్‌కుమార్ ఎన్నిక
- ఢిల్లీ మేయర్ ఎన్నికల్లో ఆప్ విజయం
- మహేశ్‌కుమార్ ఖిచి 3 ఓట్ల తేడాతో ఎన్నిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వచ్చే ఏడాదే దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికలకు ముందు ఆమ్ ఆద్మీ పార్టీకి కొత్త ఊపు వచ్చింది. మేయర్ ఎన్నికల్లో ఆప్ అభ్యర్థి మహేశ్‌కుమార్ ఖిచి జయకేతనం ఎగరేశారు. ఢిల్లీ తదుపరి మేయర్‌గా ఎన్నికయ్యారు. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఎన్నిక కోసం ఆప్-బీజేపీ మధ్య హోరాహోరీ పోటీ కొనసాగింది. కరోల్‌బాగ్‌లోని దేవ్‌నగర్ కౌన్సిలర్‌గా ఉన్న మహేశ్ ఖిచికి 133 ఓట్లు రాగా.. బీజేపీ అభ్యర్థికి 130 ఓట్లు వచ్చాయి. దీంతో స్వల్ప మెజార్టీతో ఆప్ అభ్యర్థి విజయం సాధించారు. మొత్తంగా 265 ఓట్లు పోలవ్వగా.. రెండు ఓట్లు చెల్లనివిగా అధికారులు తేల్చారు. ఎస్సీ సామాజికవర్గం నుంచి మూడో మేయర్‌గా మహేశ్ ఖిచి రికార్డు సృష్టించారు.
ఆప్ ఎంపీలు సంజయ్ సింగ్, ఎన్డీ గుప్తా, బీజేపీకిచెందిన ఏడుగురు ఎంపీలు ఓటు వేశారు. మరోవైపు మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. నిరసనగా కాంగ్రెస్ కౌన్సిలర్ సబిలా బేగమ్ ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఇక కొత్తగా ఎన్నికైన మేయర్ ఐదు నెలలు మాత్రమే పదవిలో ఉంటారు.
Also Read
- PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
- Mohan Bhagwat: రిజర్వేషన్లు కొనసాగాలి, వారు వదులుకోవాలి: ఆర్ఎస్ఎస్ చీఫ్ కీలక వ్యాఖ్యలు
- Mohan Bhagwat: స్వలింగ వివాహాలపై మోహన్ భగవత్ సంచలన వ్యాఖ్యలు
- Agni-4 Ballistic Missile: పాకిస్తాన్ మొత్తం భారత పరిధిలో.. అగ్ని-4 మిస్సైల్ సక్సెస్..
मेयर चुनाव में AAP की जीत 🔥
MCD में आम आदमी पार्टी का मेयर बना।
AAP के महेश खिंची जीते। कुल 265 वोट पड़े, 2 वोट अवैध पाए गए। आम आदमी पार्टी के उम्मीदवार महेश खिंची को 133 वोट मिले। भाजपा के उम्मीदवार को 130 वोट मिले। pic.twitter.com/sS147nAY8b
— Aam Aadmi Party Delhi (@AAPDelhi) November 14, 2024
తాజావార్తలు
-
Story Board: తమిళనాడులో ప్రతీకారమే రాజకీయమా..? కరుణ, జయ దగ్గర నుంచి విజయ్ దాకా అదే తీరా..?
-
Krishna River Management Board: శ్రీశైలం, సాగర్ నీటిపై ఏపీ కీలక ప్రతిపాదన.. కేఆర్ఎంబీకి లేఖ
-
PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
-
Off The Record: ఆసిఫాబాద్ కాంగ్రెస్‌లో అసంతృప్తి అగ్గి.. డీసీసీ అధ్యక్షురాలిపై తిరుగుబాటు?
-
Tour Of South Africa: సౌతాఫ్రికా షెడ్యూల్లో కీలక మార్పులు.. టీ20లు కూడా అక్కడే..
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్‌కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్‌లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!