Smriti Mandhana: బాలల హక్కుల కోసం స్మృతి మంధాన ముందడుగు.. ఆహ్వానించిన సచిన్ టెండూల్కర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత మహిళా క్రికెట్ జట్టు నూతన కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన మైదానం వెలుపల కూడా తన పెద్ద మనసును చాటుకున్నారు. పిల్లల హక్కులు, లింగ సమానత్వం కోసం ఆమె ఒక సరికొత్త ప్రయాణానికి శ్రీకారం చుట్టారు. ప్రముఖ అంతర్జాతీయ సంస్థ ‘యూనిసెఫ్ ఇండియా ‘సెలెబ్రిటీ అడ్వకేట్’గా స్మృతి మంధాన అధికారికంగా నియమితులయ్యారు. దేశంలోని ప్రతి బాలికకు సమాన అవకాశాలు కల్పించడం, వారి భవిష్యత్తుకు భరోసానివ్వడమే లక్ష్యంగా ఆమె ఈ బాధ్యతను స్వీకరించారు. చిన్న వయసులోనే తన ప్రతిభతో క్రీడా ప్రపంచంలో అగ్రస్థానానికి ఎదిగిన మంధాన, ఇప్పుడు సమాజంలోని చిన్నారుల హక్కుల పరిరక్షణ కోసం గళం విప్పనున్నారు.
ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని క్రికెట్ దిగ్గజం, భారతరత్న సచిన్ టెండూల్కర్ ఆమెను సాదరంగా ఆహ్వానించారు. గత కొన్నేళ్లుగా యూనిసెఫ్‌తో కలిసి చిన్నారుల సంక్షేమం కోసం పనిచేస్తున్న సచిన్ సోషల్ మీడియా వేదికగా మంధానను అభినందించారు. మైదానంలో కోట్లాది మంది యువతకు ఆదర్శంగా నిలిచే మంధాన, మైదానం వెలుపల కూడా చిన్నారుల హక్కుల కోసం అద్భుతమైన గొంతుకగా మారుతారనే పూర్తి విశ్వాసం ఉందని ఆయన పేర్కొన్నారు. యూనిసెఫ్ కుటుంబంలోకి ఆమెకు సాదర స్వాగతం పలికారు.
Also Read
- CM Revanth Reddy : 20 కోట్ల ఓట్ల తొలగింపుకు కేంద్రం కుట్ర.. మోదీని గద్దె దించే వరకు విశ్రమించం
- Muncipal Elections: ఏపీలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల పోలింగ్.. క్యూలైన్లలో ఉన్నవారికీ ఛాన్స్..
- Rahul Gandhi: జ్ఞానేశ్ కుమార్ తర్వాత మోదీ వంతు.. రామ్‌లీలా మైదాన్‌లో రాహుల్ హెచ్చరిక!
- Amit Shah: ‘‘మీరు అక్కడే ప్రధానిగా ఉండండి’’.. రాహుల్‌పై అమిత్ షా సెటైర్!
ఈ సందర్భంగా స్మృతి మంధాన తన బాల్య జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. తొమ్మిదేళ్ల వయసులో సరదాగా తన అన్నతో కలిసి క్రికెట్ ట్రయల్స్‌కు వెళ్లినట్లు ఆమె తెలిపారు. తన తండ్రి ఎప్పుడూ తాను క్రికెట్ ఆడేందుకు ప్రోత్సహించారని, తల్లి తన చదువుకు, ఆటలకు మధ్య సరైన సమతుల్యత ఉండేలా చూసుకున్నారని చెప్పారు. తాను స్వయంగా తన మార్గాన్ని ఎంచుకున్నానని, నేడు గర్వంగా అంతర్జాతీయ స్థాయిలో దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నానని తెలిపారు. ప్రతి అమ్మాయికి తన స్వంత కలలను సాకారం చేసుకునే పూర్తి స్వేచ్ఛ ఉండాలని, ఆమె ఏ రంగంలో ఎంత దూరమైనా వెళ్లేందుకు ‘అమ్మాయి’ అనే కారణం ఎప్పుడూ అడ్డుగా నిలకూడదని ఆమె గవిశ్వాసం వ్యక్తం చేశారు.
Welcome to the @UNICEFIndia family, @mandhana_smriti! You inspire millions on the field, and I know you will be a brilliant voice for children’s rights off it.
— Sachin Tendulkar (@sachin_rt) October 11, 2026
ఇటీవల అక్టోబర్ 6, 2026న హర్మన్‌ప్రీత్ కౌర్ స్థానంలో బీసీసీఐ స్మృతి మంధానను భారత మహిళా జట్టుకు పూర్తి స్థాయి కెప్టెన్‌గా నియమించిన విషయం తెలిసిందే. జింబాబ్వేతో జరగనున్న రాబోయే స్వదేశీ సిరీస్ ద్వారా ఆమె రెగ్యులర్ కెప్టెన్‌గా తన సరికొత్త ప్రయాణాన్ని ప్రారంభించనున్నారు. ఒకవైపు జాతీయ జట్టుకు నాయకత్వం వహిస్తూనే, మరోవైపు యూనిసెఫ్ వేదిక ద్వారా దేశంలోని ప్రతీ కూతురికి ఆత్మవిశ్వాసాన్ని నింపేందుకు ఆమె సిద్ధమయ్యారు. క్రీడా రంగంలో రికార్డులు సృష్టిస్తూనే సామాజిక బాధ్యతలోనూ తనదైన ముద్ర వేయడానికి సిద్ధమైన స్మృతి మంధాన నిర్ణయంపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.
తాజావార్తలు
-
Dulquer Salmaan: “టైటిల్ రోల్ నాది కాదు.. అయినా ఈ సినిమాకి సైన్ చేశా”
-
YS Jagan : ప్రజాస్వామ్య చరిత్రలో ఇది మరో చీకటి రోజు
-
Rapthadu School Attack : రాప్తాడు విద్యార్థినిపై దాడి కేసులో ట్విస్ట్.. పోలీసుల కాల్పుల్లో నిందితుడికి గాయాలు..
-
Amitabh Bachchan: టైగర్ ష్రాఫ్‌పై ఫైరింగ్ ఎఫెక్ట్.. గ్లాస్ షీల్డ్ వెనుక బిగ్ బి!
-
Ranbir Kapoor: లక్ష్మణుడి త్యాగం ఈ జనరేషన్లో సాధ్యమా? రణ్‌బీర్ క్వశ్చన్ వైరల్!
ట్రెండింగ్
-
Traditional Indian Sweets : ఈ దీపావళికి కొత్త రుచులు.. దేశంలోని 9 ప్రత్యేక స్వీట్లు
-
Medicine Storage Tips : ఇంట్లో మందులు ఎక్కడ పెడుతున్నారు? ఈ చిన్న పొరపాట్లు చేయొద్దు
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..