Kejriwal: రేపు కేజ్రీవాల్‌ను కలవనున్న పంజాబ్ కేబినెట్, ఎమ్మెల్యేలు
- రేపు కేజ్రీవాల్‌ను కలవనున్న పంజాబ్ కేబినెట్, ఎమ్మెల్యేలు
- 2027లో జరగబోయే పంజాబ్ ఎన్నికలపై చర్చించే అవకాశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఓటమి తర్వాత పంజాబ్ ప్రభుత్వం అప్రమత్తం అయినట్లు తెలుస్తోంది. 2027లోనే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం పంజాబ్‌లోనే ఆప్ ప్రభుత్వం ఉంది. ఇక్కడ అధికారాన్ని నిలబెట్టుకుంటేనే పార్టీ మనుగడ సాగుతోంది. లేదంటే పార్టీ పరిస్థితి దారుణంగా తయారయ్యే పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్తగా రేపు (మంగళవారం) ఆప్ అధినేత కేజ్రీవాల్‌ను పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్‌తో సహా కేబినెట్ మంత్రులు, ఎమ్మెల్యేలు కలవనున్నారు. ఈ సందర్భంగా 2027లో జరగబోయే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలను ఎలా ఎదుర్కొవాలన్న అంశంపై కేజ్రీవాల్ దిశానిర్దేశం చేయనున్నారు. ఢిల్లీలో ఎదురైన పరిస్థితుల గురించి కూడా చర్చించనున్నారు.
ఇది కూడా చదవండి: Supreme Court: ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత కేసును వాయిదా వేసిన సుప్రీంకోర్టు
Also Read
- CJP Leaders Released: సీజేపీ నాయకులకు బిగ్ రిలీఫ్.. అభిజీత్, సౌరవ్, అశుతోష్, ధృవ్ రాఠీ విడుదల..
- PM Modi Navratri Wishes 2026: దేశ ప్రజలకు నవరాత్రి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోడీ.. మాత శైలపుత్రిపై ఏమన్నారంటే?
- CJP Protest: "మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం వద్దు".. ఐక్యరాజ్యసమితికి భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
- PM Modi Chennai Visit Today: నేడు చెన్నైలో ప్రధాని మోడీ పర్యటన.. రూ.13,000 కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం!
ఇదిలా ఉంటే పంజాబ్ కాంగ్రెస్ నాయకుడు ప్రతాప్ సింగ్ బజ్వా మాట్లాడుతూ.. పంజాబ్‌లో 30 మంది ఆప్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌తో టచ్‌లో ఉన్నారని.. వారంతా పార్టీ మారడానికి సిద్ధంగా ఉన్నారని బాంబ్ పేల్చారు. ఢిల్లీలో ఆప్ ఓటమి తర్వాత కూడా కాంగ్రెస టార్గెట్ చేసుకున్నట్లుగానే కనిపిస్తోంది. ఇరు పార్టీల మధ్య వార్ చల్లారలేదు. మోసం, అబద్ధాలు, నెరవేర్చలేని వాగ్దానాలతో పాలన ముగిసిందంటూ ఆప్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా పంజాబ్‌లో వాగ్దానాలు అమలు చేయడంలో ఆప్ విఫలమైందని ఆరోపించారు. కాంగ్రెస్ నేత చేసిన వ్యాఖ్యలను ఆప్ సీరియస్‌గా చూస్తోంది. ఈ వ్యాఖ్యలపై కూడా రేపటి కేజ్రీవాల్ సమావేశంలో చర్చకు రానున్నాయి.
ఇది కూడా చదవండి: Rupee All time Low : డోనాల్డ్ ట్రంప్ టారిఫ్ యుద్ధం.. రికార్డు స్థాయికి పడిపోయిన రూపాయి
ఫిబ్రవరి 8న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో బీజేపీ అధికారం చేజిక్కించుకుంది. 27 ఏళ్ల తర్వాత ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకుంది. ఇక ఆప్‌లో కేజ్రీవాల్, మనీష్ సిసోడియా లాంటి రాజకీయ ఉద్దండులంతా ఓడిపోయారు. మాజీ ముఖ్యమంత్రి అతిషి మాత్రమే కల్కాజీ నియోజకవర్గం నుంచి స్వల్ప మెజార్టీతో గట్టెక్కారు. లిక్కర్ స్కామ్, శేష్ మహల్ అంశం ఆప్‌ను ఘోరంగా దెబ్బకొట్టింది. ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. బీజేపీ 48, ఆప్ 22 స్థానాలు గెలుచుకుంది. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే.. పంజాబ్‌లో కూడా కాంగ్రెస్, ఆప్ వేర్వేరుగానే పోటీ చేసే సూచనలు కనిపిస్తున్నాయి.
ఇది కూడా చదవండి: Mahesh Kumar: ఫాం హౌస్‌కే పరిమితమైన కేసీఆర్‌కి ప్రతిపక్ష హోదా ఎందుకు: టీపీసీసీ అధ్యక్షుడు
తాజావార్తలు
-
RT 78 : జెట్ స్పీడ్‌లో రవితేజ.. వివేక్ ఆత్రేయతో ‘తులాభారం’ స్టార్ట్
-
Thaman : తెలుగులో థమన్ బ్యాక్ ఆన్ ట్రాక్
-
BC Reservations: సర్కార్ కీలక ఉత్తర్వులు.. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లకు గ్రీన్ సిగ్నల్..!
-
CJP Leaders Released: సీజేపీ నాయకులకు బిగ్ రిలీఫ్.. అభిజీత్, సౌరవ్, అశుతోష్, ధృవ్ రాఠీ విడుదల..
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
ట్రెండింగ్
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
-
IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..