కరోనా ప్రపంచాన్ని వణికించింది. ఇప్పుడిప్పుడే కోవిడ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు కూడా కరోనా నిబంధనలు సడలిస్తున్నాయి. తాజాగా ఢిల్లీ, పరిసర ప్రాంతాల్లో పెరుగుతున్న కోవిడ్ కేసులు ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఢిల్లీ,నోయిడా, ఘజియాబాద్, వసంత్ కుంజ్ ప్రైవేట్ స్కూల్స్ లో నమోదవుతున్న కోవిడ్ కేసులపై ప్రభుత్వం అప్రమత్తం అయింది.
గడిచిన మూడు రోజుల్లో ఢిల్లీ ఎన్సీఆర్ పాఠశాలల్లో 50 పైగా కోవిడ్ కేసులు నమోదు అయ్యాయి. పాఠశాలల కోసం ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేయనుంది ఢిల్లీ ప్రభుత్వం. ఇప్పటికే కోవిడ్ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని పాటశాలలకు విద్యా శాఖ ఆదేశాలు జారీచేసింది. ఒక్క విద్యార్థి లేదా ఒక్క టీచర్ కి కోవిడ్ సోకిన స్కూల్ మూసివేయాలని ఆదేశించింది ఢిల్లీ ప్రభుత్వం.
Also Read: Corona Updates : దేశ రాజధానిలో పెరుగుతున్న కరోనా కేసులు..
విద్యార్ధులు, సిబ్బంది తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాలని వీలైనంత వరకు సామాజిక దూరాన్ని పాటించాలని సూచించిన డైరెక్టరేట్ ఆఫ్ ఎడ్యుకేషన్. పాఠశాలలో కోవిడ్ కేసు నమోదైతే డైరెక్టరేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ తెలియజేయాలని పాఠశాలను తాత్కాలికంగా మూసివేయాలని సూచనలు జారీచేసింది. కేసులు పెరిగితే ఫోర్త్ వేవ్ ఖాయమంటున్నారు వైద్య నిపుణులు. క్రమం తప్పకుండా చేతులు కడుక్కోవాలని, శానిటైజర్లను ఉపయోగించాలని ప్రభుత్వం సూచించింది. అంతేకాదు, పాఠశాలకు వచ్చే విద్యార్థులు, ఉపాధ్యాయులు, సహాయక సిబ్బంది తల్లిదండ్రులకు కోవిడ్ నివారణ గురించి అవగాహన కల్పించాలని సూచనలిచ్చింది.
పాఠశాలల కోసం కోవిడ్ మార్గదర్శకాలను జారీ చేయాలని విద్యా శాఖను ఆదేశించారు మనీష్ సిసోడియా. ఢిల్లీ ప్రభుత్వం కోవిడ్ పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తోందని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఉపముఖ్యమంత్రి సిసోడియా తెలిపారు. ఆసుపత్రిలో చేరికలు,మరణాల సంఖ్య అంతగా లేనందున ప్రజలు భయపడవద్దని కోరారు కేజ్రీవాల్. వైద్యనిపుణులు సైతం కోవిడ్ జాగ్రత్తలు తప్పనిసరి అంటున్నారు.