కరోనా ప్రపంచాన్ని వణికించింది. ఇప్పుడిప్పుడే కోవిడ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు కూడా కరోనా నిబంధనలు సడలిస్తున్నాయి. తాజాగా ఢిల్లీ, పరిసర ప్రాంతాల్లో పెరుగుతున్న కోవిడ్ కేసులు ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఢిల్లీ,నోయిడా, ఘజియాబాద్, వసంత్ కుంజ్ ప్రైవేట్ స్కూల్స్ లో నమోదవుతున్న కోవిడ్ కేసులపై ప్రభుత్వం అప్రమత్తం అయింది. గడిచిన మూడు రోజుల్లో ఢిల్లీ ఎన్సీఆర్ పాఠశాలల్లో 50 పైగా కోవిడ్ కేసులు నమోదు అయ్యాయి. పాఠశాలల కోసం ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేయనుంది ఢిల్లీ…