Swami Chaitanyananda Saraswati: ‘‘బేబీ, ఐ లవ్ యూ’’ అంటూ బాబా మెసేజ్‌లు.. స్వామి చైతన్యానంద లీలలు..
- "బేబీ, ఐలవ్ యూ" అంటూ బాబా మెసేజ్‌లు..
- స్వామి చైతన్యానంద సరస్వతి లీలలు.
- . విద్యార్థినులపై లైంగిక వేధింపులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Swami Chaitanyananda Saraswati: న్యూఢిల్లీలోని ప్రముఖ విద్యా, ఆధ్యాత్మిక సంస్థలో లైంగిక వేధింపుల ఆరోపణలు సంచలనంగా మారాయి. వసంత్ కుంజ్ ప్రాంతంలోని శ్రీ శారదా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ మేనేజ్‌మెంట్ డైరెక్టర్, తనను తాను ‘‘బాబా’’గా చెప్పుకునే స్వామి చైతన్యానంద సరస్వతి లీలలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఈ కేసుపై పోలీసులు విస్తృత దర్యాప్తును ప్రారంభించారు. ఆగస్టు 2025లో అనేక మంది మహిళా విద్యార్థినులు ఆయనపై ఫిర్యాదు చేశారు. ఒడిశాలో పుట్టిన పార్థసారధి, ఆ తర్వాత బాబాగా మారి ఆధ్యాత్మిక మార్గంలో వెళ్లారు, ఇప్పుడు ఈ ఆరోపణలతో అసలు స్వరూపం బయటకు వచ్చింది.
విద్యార్థినులకు ‘‘బేబీ’’, ‘‘ఐ లవ్ యూ’’ అంటూ మెసేజ్‌లు పంపినట్లు తేలింది. విద్యార్థినుల హెయిర్ స్టైల్, డ్రెస్సింగ్‌ను పొగుడుతూ మాట్లాడే వాడని అధికారులు ధ్రువీకరించారు. 2024 అక్టోబర్‌లో అడ్మిషన్ పొందిన కొద్ది సమయానికే ఒక విద్యార్థిని ఎలా వేధించాడనే విషయాన్ని ఎఫ్ఐఆర్ ప్రస్తావించింది. ఆ ఏడాది దీపావళి ముందు తను పిలిపించారని, అతను వింతగా చూసేవాడని ఆమె ఆరోపించింది. డిసెంబర్‌లో తన కాలు ఫ్రాక్చర్ అయిన తర్వాత, ఎక్స్-రే షేర్ చేయాలని ఆదేశించాడని, అప్పటి నుంచి తనతో అనుచితంగా, బలవంతపు సందేశాలు పంపేవాడని ఫిర్యాదులో పేర్కొంది.
Also Read
- Tamil Nadu Bypolls: తమిళనాడు ఉప ఎన్నికల్లో బిగ్ ఫైట్.. విజయ్ వర్సెస్ స్టాలిన్.!
- Suvendu Adhikari on UCC: UCCపై సువేందు అధికారి కీలక ప్రకటన.. 6 నెలల్లో ‘లవ్ జిహాద్’, ‘ల్యాండ్ జిహాద్’ చట్టాలు!
- Thackeray Brothers: ఠాక్రే బ్రదర్స్ 'విరాట్ గర్జన'.. ఎన్నికల సంఘంపై విపక్షాల ఉమ్మడి పోరాటం!
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
‘‘నువ్వు ఈ రోజు అందంగా కనిపిస్తున్నావు’’, ‘‘నేను నిన్ను ఆరాధిస్తున్నాను’’ వంటి మేసేజులను ప్రతీరోజు పంపే వారని విద్యార్థినులు ఆరోపించారు. వీటికి స్పందించకుంటే, మార్కులు తక్కువగా ఇస్తానని,నోటీసులు ఇస్తానని వేధించే వాడనే ఆరోపణలు ఉన్నాయి. 2025లో బీఎండబ్ల్యూ కారు పూజ నెపంతో బాబా తనను తన క్వార్టర్‌కు పిలిచాడని ఆరోపించింది. ఆ రాత్రి తనను వ్యక్తిగతంగా కలవాలని మెసేజ్ చేశాడని చెప్పింది.
2025 జూన్ లో రిషికేష్ పర్యటనలో అనేక మంది విద్యార్థినులను లైంగిక వేధింపులకు గురిచేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రతిఘటించిన విద్యార్థినులకు మార్కులు తగ్గించాడని తెలుస్తోంది. తాజా ఫిర్యాదులో మొత్తం 17 మంది మహిళా విద్యార్థులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం పోలీసులు 50 మంది విద్యార్థిను నుంచి మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వాట్సాప్ మెసేజ్‌లు, ఫోన్ రికార్డులను పరిశీలిస్తున్నారు. ఇతడిపై 2009, 2016లో కూడ లైంగిక వేధింపు ఆరోపణలు వచ్చాయి. అయితే, తన ప్రభావం, పలుకుబడితో ఇందులో నుంచి తప్పించుకున్నట్లు పోలీసు రికార్డులు చెబుతున్నాయి.
తాజావార్తలు
-
Primebook 3 Max: రూ.35,990కే కొత్త ల్యాప్‌టాప్.. 12 గంటల బ్యాటరీ, 8GB RAM, AI ఫీచర్లతో Primebook 3 Max
-
Aadarsha Kutumbam : ‘ఆదర్శ కుటుంబం’ మళ్లీ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
-
Tragedy : ట్యాంక్‌బండ్‌పై విషాదం.. పుట్టినరోజు వేడుకల్లో రెండు ప్రాణాలు బలి..
-
Tamil Nadu Bypolls: తమిళనాడు ఉప ఎన్నికల్లో బిగ్ ఫైట్.. విజయ్ వర్సెస్ స్టాలిన్.!
-
Suvendu Adhikari on UCC: UCCపై సువేందు అధికారి కీలక ప్రకటన.. 6 నెలల్లో ‘లవ్ జిహాద్’, ‘ల్యాండ్ జిహాద్’ చట్టాలు!
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!