Swami Chaitanyananda Saraswati: న్యూఢిల్లీలోని ప్రముఖ విద్యా, ఆధ్యాత్మిక సంస్థలో లైంగిక వేధింపుల ఆరోపణలు సంచలనంగా మారాయి. వసంత్ కుంజ్ ప్రాంతంలోని శ్రీ శారదా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ మేనేజ్‌మెంట్ డైరెక్టర్, తనను తాను ‘‘బాబా’’గా చెప్పుకుునే స్వామి చైతన్యానంద సరస్వతి లీలలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఈ కేసుపై పోలీసులు విస్తృత దర్యాప్తును ప్రారంభించారు.
కర్నూలు జెడ్పీ సమావేశంలో జెడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, ఎమ్మెల్యే పార్థ సారథి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. విషయం సూటిగా చెప్పాలని ఎమ్మెల్యే పార్థ సారథికి జెడ్పీ చైర్మన్ సూచించారు. రైతు సమస్యలపై చర్చించే ఓపిక లేకుంటే ఎలా? అని ఎమ్మెల్యే ప్రశ్నించారు. టైం లేకుంటే మీరు వెళ్లిపోండని, తాము చర్చించుకుంటాం అని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ క్రమంలో జెడ్పీ సమావేశంలో ఎమ్మెల్యే పార్థ సారథి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు…
భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు 500 ఎకరాలు కేటాయిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుందని మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. అమరావతిలో లా యూనివర్సిటీ ఏర్పాటు జరగనుందని, బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఏలూరులో ఏర్పాటుకు క్యాబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. టూరిజం పాలసికి లోబడి కొన్ని ప్రాజెక్ట్‌లు వస్తాయని, వైజాగ్ త్వరలో అద్భుత నగరం అవుతుందని మంత్రి పేర్కొన్నారు. నేడు ఏపీ మంత్రివర్గ సమావేశం జరిగింది. కేబినెట్ భేటీ అనంతరం నిర్ణయాలను మంత్రులు పార్థసారథి, నాదెండ్ల మనోహర్ మీడియాకు వెల్లడించారు. Also…
వైసీపీ దిగజారుడు రాజకీయాలు చేస్తోందని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పార్థసారథి ధ్వజమెత్తారు. స్వార్థ పరమైన వ్యక్తులు అధికారపీఠం ఎక్కితే.. ఏం నష్టం జరుగుతుందో గత ఐదేళ్లలో జరిగిందన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మించకుండా నాశనం చేశారని, గత ప్రభుత్వ పాలన వల్ల భూముల ధరలు పడిపోయాయని మండిపడ్డారు. మరో సైబరాబాద్ నిర్మాణం ఏపీలో సీఎం చంద్రబాబు విజన్ వల్ల ఏర్పాటు అవుతుందని మంత్రి పార్థసారథి పేర్కొన్నారు. విజయవాడలోని టీడీపీ ఆఫీసులో శ్రీ పొట్టి శ్రీరాములు…