Swami Chaitanyananda Saraswati: న్యూఢిల్లీలోని ప్రముఖ విద్యా, ఆధ్యాత్మిక సంస్థలో లైంగిక వేధింపుల ఆరోపణలు సంచలనంగా మారాయి. వసంత్ కుంజ్ ప్రాంతంలోని శ్రీ శారదా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ మేనేజ్‌మెంట్ డైరెక్టర్, తనను తాను ‘‘బాబా’’గా చెప్పుకుునే స్వామి చైతన్యానంద సరస్వతి లీలలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఈ కేసుపై పోలీసులు విస్తృత దర్యాప్తును ప్రారంభించారు.