Common Wealth Games 2022: ఇంగ్లాండ్‌లోని బర్మింగ్‌హామ్ వేదికగా జరుగుతున్న కామన్‌వెల్త్ భారత పారా టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి భవినా పటేల్ చరిత్ర సృష్టించింది. పారా టేబుల్ టెన్నిస్ సింగిల్స్ 3-5తో స్వర్ణ పతకం సాధించింది. గుజరాత్‌కు చెందిన 35 ఏళ్ల భవినా.. ఫైనల్స్‌లో నైజీరియాకు చెందిన క్రిస్టియానాపై 3-0తో గెలుపొందింది. 12-10 11-2 11-9తో ఈ ఈవెంట్‌లో అద్భుతమైన ప్రదర్శనను కనబరిచింది.
CWG 2022: కామన్‌వెల్త్‌లో నేటి భారత షెడ్యూల్.. 40 పతకాలతో ఐదో స్థానం
దీంతో టీటీ విభాగంలో భారత తరఫున గోల్డ్ సాధించిన మొదటి క్రీడాకారిణిగా రికార్డులకెక్కింది. పోటీల్లో అంతకముందు మరో పారా టీటీ ప్లేయర్ సోనాల్‌బెన్ మనూబాయి పటేల్ కాంస్యం సొంతం చేసుకుంది. ఇంగ్లండ్‌కు చెందిన స్యూ బెయిలీపై 11-5 11-2 11-3 తేడాతో విజయం సాధించి కాంస్యం సాధించింది. దీంతో కామన్వెల్త్‌లో భారత పతకాల సంఖ్య 40కి చేరింది. వీటిలో 13 స్వర్ణాలు, 11 రజతాలు, 16 కాంస్యాలు ఉన్నాయి. మొత్తం ఇప్పటివరకు కామన్వెల్త్ గేమ్స్ 2022లో భారత్ 40 పతకాలతో ఐదో స్థానంలో ఉండగా.. అందులో 13 స్వర్ణం, 11 రజతం, 16 కాంస్యం ఉన్నాయి.